వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్.. | 26 students suffer food poisoning in krishna distirict | Sakshi
Sakshi News home page

వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్..

Jul 6 2015 2:15 PM | Updated on Oct 5 2018 6:48 PM

కలుషితాహారం తిని 26 మంది విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు.

గూడురు: కలుషితాహారం తిని 26 మంది విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం కృష్ణా జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో జరిగింది. వివరాలు.. ఆదివారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థినిలు తిన్న ఆహారం వికటించింది. దీంతో సోమవారం తెల్లవారుజామున 26 మంది విద్యార్థినిలు విరేచనాలతో బాధపడ్డారు. బాధితులందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆస్పత్రిని మండల ఎండీవో, ఎమ్మార్వో తదితరులు సందర్శించి విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement