నిద్రమత్తులో డ్రైవింగ్: 20 మందికి గాయాలు | 20 injured in a rtc bus accident | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో డ్రైవింగ్: 20 మందికి గాయాలు

Jul 27 2015 8:44 AM | Updated on Sep 29 2018 5:33 PM

డ్రైవర్ నిత్ర మత్తులో ఉండి ఆర్టీసీ బస్సును నడపడంతో 20 మంది తీవ్రంగా గాయపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది.

చిత్తూరు(చంద్రగిరి): డ్రైవర్ నిత్ర మత్తులో ఉండి ఆర్టీసీ బస్సును నడపడంతో 20 మంది తీవ్రంగా గాయపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పలమనేరు డిపోకు చెందిన బస్సు పలమనేరు నుంచి తిరుపతికి వెళుతుండగా స్వర్ణముఖి నది వద్ద డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది.

దీంతో బస్సు చెట్టును ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. కాగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement