రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | 2 died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Oct 6 2015 1:16 PM | Updated on Aug 30 2018 3:56 PM

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని జ్యోతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని, కార్మికులతో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది.

మనుబోలు:  నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని జ్యోతినగర్ వద్ద ఆగి ఉన్న లారీని, కార్మికులతో వెళ్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఒకరు, చికిత్సపొందుతూ మరొకరు మృతి చెందారు. వీరంతా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కంకిపాడు నుంచి చిత్తూరుకు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ క్లీనర్ రమేశ్(28), మేస్త్రి జాన్ వెస్లీ(32)లు మరణించారు. గాయపడిన వారిని గూడూరు, నెల్లూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement