వేర్వేరు ప్రమాదాల్లో 15 మందికి గాయాలు | 15 people injured Separate accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో 15 మందికి గాయాలు

Jul 13 2016 11:46 PM | Updated on Sep 4 2017 4:47 AM

వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది గాయపడ్డారు. వంగర మండలం కస్తూర్బా విద్యాలయం

వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది గాయపడ్డారు. వంగర మండలం కస్తూర్బా విద్యాలయం ఆవరణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై కోటబొమ్మాళి మండలం గుంజిలోవా వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.
 
 వంగర : వంగర కస్తూర్బా విద్యాలయం ఆవరణలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. వంగర నుంచి రాజాం వెళ్తున్న ఆటో కస్తూర్బా పాఠశాల వద్ద రోడ్డు దిగుడుగా ఉండడంతో ఆటో డ్రైవర్ రాంబాబు వేగ నియంత్రణ చేయలేక ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి  అదుపుతప్పి ఆటో తుప్పల్లోకి వెళ్లింది.
 
 ఈ ప్రమాదంలో లక్ష్మీపేట గ్రామానికి చెందిన కలమట కీర్తన, కలమట రాంబాబు, ఐటీడీఏ కాలనీకి చెందిన దండాసి సరోజిని, విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన గర్భాపు సింహాచలం, విశాఖపట్నం పరిధి పాతపోస్టాఫీసు ఏరియాకు చెందిన ఇంద్ర ప్రవళిక, ఇంద్ర కొండమ్మ, ఇంద్ర రాంబాబు, బండారు శ్రీను, బండారు ఉమ, బండారు నూకరత్నం గాయపడ్డారు. వీరిలో ఆరేళ్ల చిన్నారి కలమట కీర్తన, గరుగుబిల్లికి చెందిన గర్భాపు సింహాచలంకు తీవ్రంగా గాయాలయ్యూరుు.
 
  స్థానిక పీహెచ్‌సీలో వైద్యాధికారి కొత్తకోట సీతారాం ప్రథమ చికిత్సనందించగా క్షతగాత్రులకు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది.
 
 ఐదుగురికి గాయూలు
 గుంజిలోవా (కోటబొమ్మాళి) :  జాతీయ రహదారిపై గుంజిలోవ జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. చల్లవానిపేట జంక్షన్ నుంచి కోటబొమ్మాళి ప్రయాణికులతో వస్తున్న ఆటో గుంజిలోవా జంక్షన్ సమీపంలో గల కల్వర్టు గోడకు ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో జిల్లా రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటరావుతో పాటు సరియాబొడ్డపాడు గ్రామానికి చెందిన సాప సీతారాం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దిన లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు.
 
 జర్జంగికి చెందిన బగాది రామకృష్ణ, రేగులపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ట్రైనీ ఎస్.ఐ  పి. మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement