వేర్వేరు ప్రమాదాల్లో 14 మందికి తీవ్ర గాయాలు | 14 Serious injuries in Separate accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో 14 మందికి తీవ్ర గాయాలు

Nov 29 2016 3:52 AM | Updated on Sep 4 2017 9:21 PM

అవలంగి గ్రామం సమీపంలో ఆగిఉన్న ఆటోను వ్యాను ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ఆగిఉన్న ఆటోను ఢీకొన్న వ్యాను 
 హిరమండలం:అవలంగి గ్రామం సమీపంలో ఆగిఉన్న ఆటోను వ్యాను ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హిరమండలం నుంచి పాతపట్నం వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆటో అవలంగి గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్‌కు సైడ్ ఇవ్వడానికి డ్రైవర్ ఆపాడు. ఆగిఉన్న ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఆటోలో ఉన్న  డ్రైవర్ చొడి చిన్నారావు, కోటబొమ్మాళి మండలానికి చెందిన శిల్లా కరుణాకరరావు, మొయిలి నారాయణరావు, సుభలయ ఆర్‌ఆర్ కాలనీకి చెందిన బి.కొండమ్మ, ఈగ ధనలక్ష్మి, నీలమ్మ, కొండరాగోలుకు చెందిన  సాదు శివ, హిరమండలంనకు చెందిన బోయిన కృష్ణారావు, పద్మావతికి తీవ్రగాయాలయ్యారుు. వీరిని హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాతపట్నం, శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement