రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | 1 die in road accident in ysr district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 2 2016 8:59 AM | Updated on Aug 30 2018 3:58 PM

వేగంగా వెళ్తున్న మినిలారీ ముందు వెళ్తున్న క్వాలిస్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి దాన్ని ఢీకొట్టింది.

రైల్వే కోడూరు: వేగంగా వెళ్తున్న మినిలారీ ముందు వెళ్తున్న క్వాలిస్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి దాన్ని ఢీకొట్టింది. దీంతో క్వాలిస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్‌ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
 
మండలంలోని ఆనందరావుపేటకు చెందిన షేక్ మహబూబ్‌పాషా(30) కోడూరు నుంచి తిరుపతికి క్వాలిస్ లో వెళ్తుండగా లక్ష్మీ నగర్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న మినీలారీ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు పల్టీలు కొట్టి బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మహబూబ్‌పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement