breaking news
-
యాక్సిస్ పవర్.. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్
సాక్షి, అమరావతి: యాక్సిస్ పవర్‌తో కూటమి ప్రభుత్వం ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ చీఫ్ విప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలుతో ప్రజలపై పెనుభారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని స్కామ్ అని, బినామీల జేబులు నింపడానికే సీఎం చంద్రబాబు దీనికి తెగించారని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.‘వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐఎస్‌టీసీ చార్జీలు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా యూనిట్ విద్యుత్తు రూ.2.49కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటేనే కూటమి పారీ్టలు గగ్గోలు పెట్టాయి. ప్రభుత్వానికి వైఎస్ జగన్ రూ.1.10 లక్షల కోట్లు నష్టం చేశారంటూ చంద్రబాబు, ఆయన వర్గం దారుణమైన అబద్ధపు ప్రచారం చేశారు. మరి యాక్సిస్ పవర్ నుంచి యూనిట్ రూ.4.60కు కొనుగోలుకు ప్రస్తుత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభకోణానికి ప్రణాళికలు రచించింది.పైగా 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించడానికి వీల్లేకుండా సీలింగ్ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపింది. యూనిట్ మీద రూ.2.11 అధికంగా చెల్లించి కొనడం, ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఒప్పందాన్ని ఆమోదించుకోవడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెగించారో తెలుస్తోంది’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనంతా చీకట్లే ‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎప్పుడూ లో ఓల్టేజీ సమస్యలతో రైతులు అల్లాడేవారు. పంపిణీ సంస్థలను దివాలా తీయించారు. వైఎస్సార్ సీఎం అయ్యాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారు. మళ్లీ 2014లో బాబు సీఎం అయ్యాక తప్పుడు ఒప్పందాలతో దోపిడీకి తెరతీశారు. ఉమ్మడి ఏపీ విడిపోయేనాటికి రూ.29 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు ఉండగా, 2019లో దిగిపోయే నాటికి అవి రూ.86,300 కోట్లకు చేర్చారు. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 24 శాతం పెరిగింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక కరోనా సంక్షోభంలోనూ సీఏజీఆర్ రేషియో 7.2 శాతమే నమోదైంది’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య డిస్కంలకు రూ.47,800 కోట్లు చెల్లిస్తే, 2014–19 నడుమ టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్తు బకాయిలు రూ.8,845 కోట్లు ఎగ్గొట్టిందని, వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. 2014 వరకు 11 పీపీఏలు (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు) మాత్రమే ఉంటే, 2014–19 మధ్య చంద్రబాబు 39 సోలార్ పీపీఏలు చేసుకున్నారని, అన్నీ 25 ఏళ్ల కాల పరిమితితో, మూడేళ్లకోసారి ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుని ప్రజల నెత్తిన అప్పు మోపారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 2014 వరకు 91 విండ్ పీపీఏలు జరిగితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 133 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ యూనిట్ రూ.4.84 కనీస చార్జితో చేసుకున్నవే అని చెప్పారు. -
‘అప్పుడు రూ. 2.49.. ఇప్పుడు రూ. 4.60.. మరి ఇదేంటి బాబూ?’
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తల రాశారు. సెకితో అత్యంత తక్కువ రేటుకు 2.49 రూపాయలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో యూనిట్‌కు రూ.4.60 రూపాయలకు విద్యుత్ ఒప్పందం చేసుకుంది. రూ.2.49 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందన్న మీరు రూ.4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారు. రూ.2.11 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు. రూ.2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్‌పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలి.కూటమి ప్రభుత్వ కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల రూపాయల గండి పడుతుంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు. డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దానిమీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సెస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారుచౌకగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కే అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనిట్‌కు ఏకంగా రూ.4.60లు కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. -
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే, చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర్ గణేష్, వరుదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్ రాజు, కన్నబాబు రాజు, మలసాల భరత్, శోభ హైమవతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు.👉ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.అప్పు చేసిన లక్ష 50 వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి.కూటమి పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. భర్త చనిపోతేనే కొత్త పెన్షన్ భార్యకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అర్హులకు పెన్షన్ లు అందజేశారు. మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి పున: ప్రారంభం చేశారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా?. విశాఖ నూతన రైల్వే జోన్ ఏమైంది?. రైల్వే భవనాలు ఎందుకు నిర్మించలేదు. మూడు టీవీలు మూడు పేపర్లతో పబ్బం గడుపుతున్నారు. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. సింహాచలం కొండ మీద మరణాలు సంభవించాయి. నాయకుల ప్రచార పిచ్చితో ఏడుగురు భక్తులు మరణించారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.👉మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు.👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారు.👉కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. అమర్నాథ్కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషం. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలి.👉మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు పెడుతుంది. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుంటున్నాము. ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలలకే బయట పడింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు..👉కన్నబాబు రాజు మాట్లాడుతూ.. కూటమిలో గొడవలు అప్పుడే మొదలయ్యాయి. 2026లో కూటమిలో చీలిక ఏర్పడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయరు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది.👉బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. వైఎస్ జగన్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేస్తారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అని అన్నారు. -
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్‌సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు. -
పవన్ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్‌లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్ జగన్ సూచించారు. -
మైనింగ్ మాఫియా డాన్ ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు (పొగతోట): నెల్లూరు జిల్లాలో వేలాది కుటుంబాలను రోడ్లపాల్జేసి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మైనింగ్ మాఫియాగా మారారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి 5 రోజులు గడువు ఇస్తున్నానని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే సైదాపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌తో తమకేమీ సంబంధం లేదని ఆయన్ను కలిసిన లీజుదారులకు ఎంపీ చెప్పారన్నారు. అయితే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా లక్ష్మి క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని ఆధారాలు చూపించారు. వాస్తవాలు కనబడుతుంటే మైనింగ్‌తో ఆయనకు సంబంధలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మైనింగ్‌తో ఏ సంబంధం లేకపోయినా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారని.. అక్రమ మైనింగ్కి పాల్పడుతూ రూ.వందల కోట్లు దోచుకుంటున్న ఎంపీపై మాత్రం కేసులు ఎందుకు పెట్టరని నిలదీశారు.గత ప్రభుత్వంలో మైన్లకు రూ.255 కోట్ల జరిమానావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్‌పై అధికారులు చిత్తశుద్ధితో పనిచేశారని అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారికి రూ.255 కోట్ల జరిమానాలు విధించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిమానాలు విధించిన, కేసులు ఉన్న గనులను మాత్రమే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆదాయం వస్తే.. ప్రస్తుతం రూ.30 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదన్నారు. సైదాపురం మండలంలో 200 మైన్లు ఉన్నా.. కేవలం 30 మాత్రమే ప్రారంభించడం వెనుక రహస్యమేమిటని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి స్వార్థంతో వ్యవహరిస్తూ ఆయన చెప్పిన ధరకు, ఆయన కంపెనీకే సరఫరా చేసే వారికి మాత్రమే మైనింగ్ అనుమతులు ఇచ్చారన్నారు. మైనింగ్ యజమానులు కోర్టుకు వెళితే వాటిని తెరవాలని ఫిబ్రవరిలో కోర్టు ఆదేశించిందన్నారు. అయినా ఇప్పటివరకు గనులను తెరవడంలేదన్నారు. దీంతో మైనింగ్ యజమానులు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్లీ కోర్టును ఆశ్రయించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనింగ్ యజమానులెవరూ ఎవరూ కోర్టుకు వెళ్లలేదన్నారు. మైనింగ్ పరిశ్రమను తెరవనివ్వకుండా, ఇతరులకు పర్మిట్లు రాకుండా ఎంపీ అడ్డుకుంటున్నారని తెలిపారు.అన్ని ఎక్స్‌పోర్టు కంపెనీలు మూతగతంలో ఇక్కడ దాదాపు 30 ఎక్స్‌పోర్టు కంపెనీలు ఉంటే.. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయని, ఎంపీ వేమిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న రెండు కంపెనీలు మాత్రమే ఎక్స్‌పోర్టు చేస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక లక్ష్మి క్వార్ట్ ్జ కంపెనీ ఏర్పాటు చేయగా, తాజాగా ఫినీ క్వార్ట్ ్జ ప్రారంభించారన్నారు. ఎగుమతిదారుందరినీ నిలిపివేశారని.. ఒక్క ఎంపీ వేమిరెడ్డి ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారానే సరుకు రవాణా జరుగుతోందని ఆధారాలతో సహా వెల్లడించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల మైన్లు కూడా తెరవలేదన్నారు. ధనదాహంతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న ఎంపీకి పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు.50 ఏళ్లు దాటిన మైన్లు స్వాధీనం చేసుకోవాలిగతంలో శోభారాణి మైన్ కంపెనీకి రూ.32 కోట్లు ఫైన్ వేశారని అనిల్‌కుమార్ గుర్తు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో శోభారాణి మైనింగ్ కంపెనీ ఇల్లీగల్ అని చెప్పారన్నారు. గతంలో మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ పంచనామా చేసి 38 వేల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదిక ఇచ్చారన్నారు. ప్రస్తుతం అదే అధికారి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదికలు ఇచ్చారన్నారు. 50 ఏళ్లు దాటిన గనులను నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. లీజు సమయం దాటినా మైన్లలో అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను వేలం వేయాలని ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు నిల్వ ఉన్న క్వార్ట్ ్జను వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న గంజాయి బ్యాచ్సైదాపురంలో గంజాయి బ్యాచ్ మాఫియా నడిపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మైన్ల వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మహిళలను, అటుగా వెళ్తున్న వాహనాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి అక్రమ మైనింగ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ప్రస్తుతం అతనే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మఫ్టీలో వెళితే సైదాపురంలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. -
రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతోందని.. ఎల్లో మీడియా ప్రతిరోజూ వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా తప్పుడు కథనాలు వండి వడ్డిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా, కొందరు పోలీస్ అధికారులు కలిసి చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏమీ లేకపోయినా తప్పుడు వార్తలు సృష్టించి.. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని, కొందరు ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.టీడీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు పేరును చేర్చిన అధికారులను.. ఇప్పుడు టార్గెట్ చేసుకొని దర్యాప్తును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నారని.. నేరం ఎలా జరిగిందో వారే రాస్తారని.. అందులో ఎవరెవరు ఉన్నారో కూడా వారే రాస్తారని.. ఇంకా ఎవరెవరిని స్కామ్‌లో చేర్చవచ్చో కూడా డిసైడ్ చేస్తూ డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే ఆదేశించారని రాజ్ కేసిరెడ్డి సిట్ విచారణలో చెప్పినట్లుగా ఈనాడులో రాసుకొచ్చారని మండిపడ్డారు. సిట్ ఏ ప్రశ్నలడిగిందో.. దానికి రాజ్ కేసిరెడ్డి ఏ జవాబులిచ్చారో కూడా రాసుకొస్తున్నారంటూ దుయ్యబట్టారు. జర్నలిజం ప్రమాణాలు గాలికొదిలేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. రాజ్ కేసిరెడ్డి ఒకటి చెబితే ఇక్కడ మరొకటి రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారని ఎల్లో మీడియాను నిలదీశారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు.. మిథున్‌రెడ్డి పాత్రను ఎక్కడా ధ్రువీకరించలేదంటూ ప్రాసిక్యూషన్ చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి సంబంధం ఉందంటూ కౌంటర్ వేశారని మండిపడ్డారు. కోర్టులను కూడా తప్పుదోవపట్టించేలా ప్రాసిక్యూషన్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగం, చట్టం, కోర్టులంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని.. వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మీద ప్రతిరోజూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని.. కూటమి ప్రభుత్వం, కొందరు పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా కలిసి ఎవరెవరిని ఎలా ఇరికించాలా? అని కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. చట్ట పరిధిని దాటి వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరినీ కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. -
రాప్తాడు వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్
అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఇటీవల దారుణహత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ రాక సందర్భంగా కుంటిమద్ది హెలీప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.చెన్నేకొత్తపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మవరం మెజిస్ట్రేట్.. పది మంది వైఎస్సార్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పరామర్శించారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. -
‘అలాంటిదే.. మరో స్కాం బయటకొచ్చింది: చెల్లుబోయిన వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీం రచించినా దాని వెనుక స్కాం తప్పకుండా ఉంటుందని.. దానికి చరిత్రలో ఎన్నోవందల ఉదాహరణలున్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలాంటిదే కొత్తగా మరో స్కాం బయటకొచ్చిందని.. బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పకుంటూ ఆయన ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటాడు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థంకాని పెద్ద శేష ప్రశ్న. కుట్టుమిషన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు. ఒక్కో లబ్ధిదారు పేరుతో రూ. 16 వేలు దోపిడీరూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లోదాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం రూ. 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టుమిషన్‌కి రూ. 4300, ఒక్కో మహిళకు శిక్షణ కోసం రూ. 3 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు రూ. 75.06 కోట్లే. మిగిలిన రూ. 154 కోట్లకు మాత్రం లెక్కలే లేవు. ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపు రూ. 16 వేల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో రూ. 25 కోట్లుశిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. టెండర్ నిబంధనల ప్రకారం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నీకింత.. నాకింత రూల్ ప్రకారం ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి బీసీ మహిళలను పావులుగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకి 45 రోజులపాటు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే, కేవలం 135 గంటల మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. లబ్ధిదారులకు ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వడం లేదు.పేరున్న శిక్షణ సంస్థలను కాదని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టి భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ స్కీమ్ రచనలో కీలకపాత్ర పోషించిన ఒక రిటైర్డ్ అధికారికి తగిన ప్రోత్సాహకం ఇచ్చారని నాకు సమాచారం ఉంది.టెండర్లలోనూ మాయాజాలందోచుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని సిద్ధం చేసిన చంద్రబాబు, టెండర్ల దశ నుంచే చక్రం తిప్పడం మొదలైంది. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండటం విచిత్రం టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థను కాదని అంతకంటే ఎక్కువకు కోట్ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు.మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందే. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్ చేసి ఎల్1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. ఎల్2, ఎల్3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు.గతంలోనూ ఆదరణ పేరుతో మిషన్ పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మహిళలను వంచించారు. వైయస్ జగన్ హయాంలో మహిళలను తలెత్తుకుని జీవించేలా పథకాలను రూపొందించడం జరిగింది. ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. బీసీల జీవితాల్లో వెలుగులు నింపితే, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడుతోంది. -
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ’కూటమి’ అడ్డదారులు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షం గొంతులను అణగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్‌కు భద్రతా సిబ్బందిని తగ్గించారు. పదిహేనేళ్ల క్రితం మూలాన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఉద్దేశపూర్వకంగా భద్రత కుదింపుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకుల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్త వరకు ఎవర్నీ వదలకుండా కూటమి నాయకులు ప్రతీకార రాజకీయాలకు దిగుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలోనూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సార్సీ కమిటీ రివ్యూ కూడా చేయకుండా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కనీసం ఏసీ కూడా సరిగ్గా పనిచేయని వాహనాన్ని ప్రతిపక్ష నాయకుడికి కేటాయించి అవమానించారు.ఈ వాహనం ఇప్పటికే ఒకసారి రోడ్డు మీద సడెన్‌గా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా చూశారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ కేటాయించడం లేదు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లినప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న హై ప్రొఫైల్ పర్సన్‌కి ఒక్క పోలీస్ అధికారి భద్రతను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం. వైఎస్ జగన్ రామగిరి మండలం పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. హెలిప్యాడ్ దగ్గర సరైన భద్రత కల్పించకపోవడంతో విండ్ షీల్డ్ దెబ్బతిని బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లాల్సి వచ్చింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 1100 మందిని మోహరించామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 1100 మంది ఉన్నా కంట్రోల్ చేయలేని అధికారులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు.నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న వారికి నిబంధనల ప్రకారం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 8 ఆర్మ్డ్ ఫోర్స్ కేటాయించాలి. ఒకవేళ జనాలు ఎక్కువైతే 40 నుంచి 50 మంది వంద మీటర్ల వెలుపల సివిల్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా జనాల తాకిడి ఎక్కువైతే ఆ ప్రాంతాన్ని బట్టి పోలీసులను రౌండ్స్‌గా ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలన్నీ ప్రభుత్వం పాటించి ఉంటే హెలిప్యాడ్ వరకు జనాలు రాగలిగేవారా? పోలీసులకు సహకరించిన తోపుదుర్తిప్రభుత్వ వైఫల్యాలను, పోలీసుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరోజు కార్యక్రమానికి హాజరైన వైయస్సార్సీపీ ముఖ్య నాయకుల మీద ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుల మీద అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. జనం నవ్వుతారనే కనీస విచక్షణ కూడా లేకుండా తోపుదుర్తి సోదరులే ప్రజలను రెచ్చగొట్టి హెలిప్యాడ్ వద్దకు తీసుకెళ్లారని నమ్మశక్యం కాని అక్రమ కేసులు పెట్టారు. ఆరోజు జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన డీఎస్పీ, తన హ్యాండ్ మైకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతికిచ్చారు.అభిమానులను కంట్రోల్ చేసే బాధ్యతను ఆయన చేతుల్లోనే పెట్టారు. ఇదంతా చూసి కూడా జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులను మోహరించామని ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం అనిపించుకోదా? పైగా పోలీసులకు సహకరించి అభిమానులను కంట్రోల్ చేసిన తోపుదుర్తి మీద అభిమానులను రెచ్చగొట్టి పంపారని పోలీసులతోనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ అక్రమ కేసుల మీద ఆయన న్యాయస్థానాల్లో పోరాడుతుంటే ఆయన తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆయన కోసం నియోజకవర్గంలోని వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారు. వేకువజామున వారి ఇళ్లకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు.అవినీతి అధికారుల భరతం పడతాం2019-24 మధ్య వైయస్సార్సీపీ పాలనలో నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పది నెలల్లో మళ్లీ పగలు ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయి. అమాయకులైన వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. కొంతమంది పొలీసులను అడ్డంపెట్టుకుని అంతరించిపోయిన రౌడీయిజాన్ని మళ్లీ తట్టిలేపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం.కూటమి నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వారి ప్రతీకార రాజకీయాలకు సహకరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో శిక్షను అనుభవించకతప్పదని గుర్తుంచుకోవాలి. ఏడాది పాలన పూర్తికాకుండానే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 2029లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టడం ఖాయం. -
బాలకృష్ణ పర్యటన.. హిందూపురంలో ఉద్రిక్తత
సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు పొందిన పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీంతో, వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్ పూర్ సర్కిల్లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
‘ఏపీలో గనుల దోపిడీ.. పెనాల్టీలో ఉన్న మైన్స్ ఓపెన్’
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీ ఉన్న మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. క్వార్జ్ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జ్ దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించడానికి అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికి ఉంటుంది.. మాజీ మంత్రి కాకాణికి న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంది.పెనాల్టీ ఉన్న మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు?. గత ప్రభుత్వంలో 150 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు. 100 మైన్స్ దాకా మూసేశారు. ఈ ప్రభుత్వంలో మైన్ మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. వైఎస్సార్సీపీ హయాంలో మేము ఎవరిని బెదిరించలేదు.. ఇప్పుడు మైన్ ఓనర్స్ ని బెదిరించి.. గనులు మూయించారు. ఓనర్స్ కోర్టుకు వెళ్లారు.వేమిరెడ్డే సూత్రధారి..క్వార్జ్‌ని నమ్ముకున్న కూలీలు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సామాన్య ప్రజల కోసం అవసరమైతే కొట్లాడతా.. కాకాణి మీద కేసు పెట్టునట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చెయ్యాలి. క్వార్జ్ అక్రమాలపై వీపీఆర్ సమాధానం చెప్పాలి.. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటికి తీసుకొస్తాం. ఎవరి హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందో చూడండి. కొండలు కొండలు గ్రావెల్.. ఇసుకను తీసుకెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఏరోజు కూడా గనుల యజమానులు కోర్టుకు వెళ్ళలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదు. గనుల యజమానుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. మందకృష్ణ మాదిగకు చెందిన ఎంఆర్పీఎస్ నేతలు కూడా గనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారులక్ష్మి క్వార్జ్ అండ్ సాండ్ కంపెనీలో VPR డైరెక్టర్ గా వున్నారు. ఈ కంపెనీనే తెల్లరాయిని ఎగుమతి చేసింది. తరువాత ఫినీ క్వార్జ్ లిమిటెడ్ పేరుతో సిస్టర్ కంపెనీను ప్రారంభించారు. దీని డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఈ కంపెనీ ద్వారా కూడా తెల్లరాయిని ఎగుమతి చేశారు. నేను ఏ ఒక్క గని యజమానిని కూడా బెదిరించలేదు. ఇప్పుడు వీళ్లే గనుల యజమానులను బెదిరించి వారి నుంచి మెటీరియల్ ను తీసుకుంటున్నారు. ఈ తెల్లరాయిని తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు తహసిల్దార్ చెబుతున్నారుఅక్రమ మైనింగ్..గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. కానీ ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయి ని తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు, వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. గనుల వద్ద గూండాలను పెట్టారు,. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలి, వేమిరెడ్డి తన అనుచరుల వద్ద మాట్లాడించకుండా తానే మాట్లాడాలి. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తా, గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నా.తన కంపెనీ కాకపోతే ఆయన ఎందుకు చెప్పడం లేదు?. రూ.15 వందల కోట్ల మేర ఎంపీ దోపిడీకి పాల్పడ్డారు. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి, క్వార్జ్ డంప్‌ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి, బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు. చేస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారు. సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ.. ప్రజలను, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. టీడీపీ నేతలు డ్రామాలు ఆపాలంటూ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి మద్దతు తెలిపి టీడీపీ ముస్లింల గొంతు కోసిందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. అయితే ర్యాలీ ప్రారంభం కాకముందే.. టీడీపీ నేత అమీర్ బాబు కొందరు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలు వద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేశాకే ఇలాంటి ర్యాలీలకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక అమీర్‌బాబు తన అనుచర గణంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
అన్నం పెట్టే రైతులకు సున్నమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే వారు కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్లో ధర లేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.చరిత్రాత్మక నిర్ణయాలతో కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ‘మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?’ అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన ఎండగట్టారు. ఆ పోస్ట్‌లో ఇంకా ఏమన్నారంటే.. కనీస బాధ్యతను విస్మరించారు⇒ చంద్రబాబు గారూ.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం వారి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం ధర్మమేనా? ⇒ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధర రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? ⇒ మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కానీ, ఒక్క ఎకరాకు సంబంధించి కానీ, ఒక్క క్వింటాల్ గానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. ఇది వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేశాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ⇒ ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. -
రాజధానిలో పేదలు ఉండకూడదా?
సాక్షి, అమరావతి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014–19లో మట్టి, నీరు తెచి్చచ్చారంటూ విమర్శించిన ప్రధానినే మరోసారి పిలిచి పెద్ద ఈవెంట్ నిర్వహించారని చెప్పారు. గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేయించడం నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని అంటే చంద్రబాబు దృష్టిలో ఆయనకు అనుకూలమైన సామాజిక వర్గం మాత్రమే ఉండే రాజధాని అని అర్థం అన్నారు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిని ప్రజా రాజధాని అనగలమా? అని నిలదీశారు.‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేసి.. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల వారు ఉండాలని భావించింది. అందుకోసం వారికి దాదాపు 900 ఎకరాలను కేటాయించింది. మొత్తం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచి్చంది. అయితే దీనిపై టీడీపీ న్యాయస్థానాల్లో 26 పిటీషన్లు వేయించింది. రాజధానిలో పేదలు ఉంటే, అది ప్రజా రాజధానికే వ్యతిరేకమని మాట్లాడారు. జీఓ 45ను రద్దు చేయాలని న్యాయస్థానాల్లో వాదనలు వినిపించారు. అన్ని వర్గాల వారు లేకుండా రాజధాని ఎలా ఉంటుందని న్యాయస్థానం సైతం పిటిషనర్‌ను ప్రశ్నించింది.దీనిపై చంద్రబాబు డైరెక్షన్లో సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులను కొట్టేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం, ఆర్5 జోన్నే తొలగించడం దుర్మార్గం, అన్యాయం’ అని మండిపడ్డారు. అలాంటప్పుడు రాజధాని అప్పులతో మిగిలిన వారికి సంబంధం లేదని ప్రకటిస్తారా.. అని నిలదీశారు. ప్రధాని ఎదుట విభజన హామీల గురించి, పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశి్నంచారు. -
‘మేము అభివృద్ధి కోరుతున్నాం.. అరాచకం కాదు’
పశ్చిమ గోదావరి జిల్లా : ఏపీలో ఎక్కడ చూసినా అరాచక పాలనే కొనసాగుతుందన్నారు పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారేనన్నారు. ‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జిల్లాలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా సమయంలో ఆక్వా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారు.రాష్ట్రoలో అరాచక పాలనకు సాగుతుంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తణుకులో ఎమ్మెల్యే గోవద ప్రోత్స హిస్తున్నారు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చుతున్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్లు కూల్చేస్తున్నారు. మీరు పేదలకు ఎన్ని ఇళ్లు నిర్మించారు. అధికార బలంతో నిరుపేదల ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆక్రమణల పేరుతో పేదలను నిరాశ్రయులు చేయడం సరికాదు. ఇరిగేషన్ మంత్రి ఉన్నా డెల్టా ఆధునీకరణ ఊసే లేదు. వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. మేము అభివృద్ధికోరుతున్నాం.. అరాచకం కాదు. రాష్టంలోపక్షపాత కక్ష పూరిత పాలన సాగుతుంది.మేము స్యాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇచ్చాం. ఆక్వా రైతులను గాలికి వదిలేసారు..ఫీడ్ సీడ్ ధరలు కట్టడి లేదు. నిరుపేదలకు, రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది’ అని ప్రసాద్ రాజు తెలిపారు.సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి..అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ అని ఊదరగొట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట్ నాగేశ్వరావు మండిపడ్డారు. ‘సెంటు భూమి సమాధి కి కూడా సరి పోదు అన్న మీరు 3సెంటు భూమి ఇచ్చారా.?, పాలకోడేరులోపేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం. పేదలను హింసించడం సరికాదు. మేము 32 లక్షల ఇళ్లు ఇచ్చాము.. మీరు పేదల ఇళ్ల ఇవ్వాలన్న వూసేలేదు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు అది ఈ కూటమికి పాలనకు సిగ్గు చేటు. నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు లో చేతులు ఎత్తేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి.’ అని కారుమూరి డిమాండ్ చేశారు. -
‘బాబు, లోకేష్‌లు ఎంత పొగిడినా ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వలేదు’
ఢిల్లీ: ఏపీకి పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లు ఎంత పొగిడినా ఏపీ ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వలేదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజల ఆశలను నీరు గార్చారన్నారు రామకృష్ణ. ‘ చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలే నెరవేర్చలేక పోతున్నారు. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపుతున్నారు. వెనుకబడిన ప్రాంతా అభివృద్ధిపై చంద్రబాబుకు శ్రద్ధలేదు. కర్నూలు. కడప విమానాశ్రాయల ఆదాయం తగ్గిపోయింది. ఏపీ విభజన చట్టలోని స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా అమలు చేయాలని అడగలేదు. అందరినీ కలుపుకని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలోని హామీలను సాధించాలి’ అని రామకృష్ణ సూచించారు. -
ఆంధ్రా అంటే అమరావతి ఒక్కటే కాదు: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: ఆంధ్రా అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది కచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంకా ఏమన్నారంటే..రాజధాని ప్రాంతమైన అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం ఉంది. నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు రూ.1100 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారు? ఆ 5 లిప్టు స్కీమ్‌లు చేపట్టకపోతే, అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయి. ఇంకా దేశంలో జాతీయ రహదారులను కిలోమీటరుకు రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తుంటే, రాజధాని అమరావతిలో మాత్రం కిలోమీటర్ రోడ్డుకు ఏకంగా రూ.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పైగా ఆ పనుల కాంట్రాక్టులన్నీ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో తమ వారికే కట్టబెడుతున్నాడు. మరోవైపు ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.ఏడేళ్ల కిందట అమరావతిలో ఐకానిక్ టవర్లు, ఆకాశహర్మ్యాలు, సీ ప్లేన్, నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్‌తో ప్రచారం చేసి ఊదరగొట్టారు. ఐదేళ్లు గడిచాక చూస్తే అమరావతిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ తప్ప వేరే నిర్మాణాలు కనిపించలేదు. అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 34 వేల ఎకరాల భూమిని బీడు పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ మరో 44 వేల ఎకరాలు సేకరిస్తానని మంత్రి పి.నారాయణ చెబుతున్నారు. ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం.. కష్టంగా ఇస్తే కష్టంగానే తీసుకుంటామని ఆయన రైతులను ముందే హెచ్చరిస్తున్నారు.ఒక పక్క బస్టాండ్ కట్టడానికే నిధులు లేవని చెప్పే చంద్రబాబు, విజయవాడలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకుని మళ్లీ అమరాతిలో విమానాశ్రయం కడతామని డాబు మాటలు చెబుతున్నాడు. 11 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇదిచాలదన్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నిధులు డ్రా చేసుకునే హక్కును ప్రైవేటు సంస్థలకు అప్పగించారు.కమీషన్ల కోసం, తమ వారి జేబులు నింపేందుకు అమరావతి అంచనా వ్యయాన్ని ఏకంగారూ. 44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారు. కమీషన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని నాడు వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను చంద్రబాబు రద్దు చేశారు. కొత్తగా మొబిలైజేషన్ విధానం తీసుకొచ్చి, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ కిందకు 10 శాతం నిధులు ఇచ్చి, అందులో నుంచి 8 శాతం కమిషన్ల కింద వసూలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా నిజం కాకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెడుతూ, అప్పులన్నీ చేసి మొత్తం అమరావతిలోనే ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని సాకే శైలజానాథ్ నిలదీశారు. -
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025 -
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు.