breaking news
-
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టు అనుమతిచ్చినా.. జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు!
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాల్ని ఇచ్చిన జేసీపై విశ్లేషకులు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నా టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నుకుండిపోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారనే అబిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమరావతి రీలాంచ్.. పరువు కోసం బాబు సర్కార్ పాట్లు
సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్లైన్లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు. -
పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలకు కోర్టు ఆదేశాలు గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు. -
రాక్షస రాజ్యం
‘‘రాజకీయాలంటే నీ మాదిరిగా చేయడం కాదు..! ఎంపీటీసీలమైనా, జెడ్పీటీసీలమైనా మమ్మల్ని చూసి నేర్చుకో..! విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టే రాజకీయమంటే ఇదీ..! అని చంద్రబాబు నాయుడుకు మీరంతా గట్టిగా చాటి చెప్పారు. గొప్ప తెగువ ప్రదర్శించారు. విలువలు, విశ్వసనీయత పట్ల చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా’’ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్ బుక్, రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మార్కాపురం ఎంపీపీ, ఎంపీటీసీలు, గాండ్లపెంట ఎంపీటీసీలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లతోపాటు ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. మనకు, చంద్రబాబుకు తేడా ఇదీ...మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలల పాలనలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మన రాజకీయ జీవిత ప్రస్థానం అంతా ప్రజలు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. ఏనాడూ దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి రాజకీయాలు చేయలేదు. అదే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలవుతుంది. బిడ్డను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి మొదలుపెడితే అధికారం కోసం జీవితమంతా వెన్నుపోట్లు పొడుస్తూనే రాజకీయాలు సాగిస్తూ వచ్చారు. స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు..శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఆరింట వైఎస్సార్సీపీ గుర్తు మీద గెల్చారు. టీడీపీ గుర్తుతో ఒక్కరే నెగ్గారు. అలాంటప్పుడు ఎంపీపీ పదవి కచ్చితంగా వైఎస్సార్సీపీకే రావాలి. ఒక్కడే ఉన్న టీడీపీకి ఎలా వస్తుంది? అక్కడ ఏం జరిగిందో మనమంతా చూశాం. యుద్ధ వాతావరణం సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్మెన్లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు చేస్తున్నారు. మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్‌కాట్ చేసి వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే సర్దుబాటు చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ కూడా ఎంపీపీ మనకే రావాలి. పోలీసులు బెదిరించడంతో అయినా మనం క్యాంపులు పెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి పార్టీల నాయకులు సూట్‌కేసులతో ప్రలోభాలు పెట్టారు. అక్కడ మనవాళ్లు అంతా గట్టిగా ఒక్కటిగా నిలబడ్డారు. ఎవరూ జారిపోలేదు. మీ అందరి తెగువకు హ్యాట్సాఫ్ చెప్పాలి.కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లలో 26 మంది మన పార్టీ గుర్తు మీద గెల్చారు. మరి అక్కడ మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్సార్సీపీ గెలవాల్సి ఉండగా రకరకాల ప్రలోభాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మనవాళ్లు గట్టిగా నిలబడ్డారు.కుప్పం మున్సిపాల్టీని చూస్తే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకుగాను వైఎస్సార్సీపీ 19 గెలిచింది. టీడీపీ కేవలం 6 మాత్రమే నెగ్గింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అదిస్థాయిలో అంటే.. మున్సిపల్ ఛైర్మన్‌ను బెదిరించి రాజీనామా చేయించి వాళ్ల పార్టీలోకి తీసుకున్నారు. చంద్రబాబు అంతటితో ఆగిపోకుండా... ఇది కుప్పం...! నా నియోజకవర్గం.. నేను ముఖ్యమంత్రిని.. నేను ఒక రాక్షసుడిని.. రాక్షస సామ్రాజ్యానికి రాజుని.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతా.. రాష్ట్రమంతా తెలుగుదేశం వాళ్లు ఇలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతాలు ఇచ్చాడు..! అలా సంకేతాలు ఇచ్చి బలవంతంగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. కేవలం 6 స్థానాలు మీరు (టీడీపీ) గెలిస్తే.. 19 స్థానాలు మేం గెలిచాం. అయినా కుప్పం చైర్మన్ మీదేనని చెప్పుకుంటున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి మీవైపు తిప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఇదా చంద్రబాబూ? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. రాజ్యాంగం అనేది భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి లోబడి ఉంటానని చెబుతాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి రాజ్యాంగాన్ని తగలబెడుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. 19 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుంచి గెలిచినా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం నిలిచింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కుప్పాన్ని మున్సిపాల్టీగా చేయాలన్న ఆలోచనే రాలేదు. కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకు ఏరోజూ తట్టలేదు. రెవెన్యూ డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి తాగు నీళ్లు కూడా ఇవ్వలేదు. అది కూడా మన హయాంలోనే చేశాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో... తెగువ చూపించి నిలబడిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట..ఇంతకు ముందు మన ప్రభుత్వ హయాంలో బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు చేయలేకపోవచ్చు. జూన్‌లో మనం ప్రమాణ స్వీకారం చేస్తే.. తదుపరి మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువగా ధ్యాస పెట్టి పాలన నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలను మీ జగన్ చూశాడు. మీరు చూపిస్తున్న తెగువను కూడా మీ బిడ్డ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నా. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తా. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మళ్లీ మనమే అఖండ మెజార్టీతో వస్తాం. -
కంచం లాగేశారు! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్ ఇచ్చినవి అన్నీ కొనసాగుతాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మబలికారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరుద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్ సిక్స్ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామనుకున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతున్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్వర్క్ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడుస్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజకవర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం’
కర్నూలు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకి అమరావతి, పోలవరం తప్ప ప్రజల గురించి ఆలోచించే టైమ్ లేదని మండిపడ్డారు. చంద్రబాబు లక్ష కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మిస్తున్నాడన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మ ఒడిగానీ, విద్యా దీవెన గానీ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుతంలో చంద్రబాబు పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని , వాటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి జగన్ ను మళ్లీ సీఎం చేసుకుందామని ఎస్పీ మోహన్ రెడ్డి పిలువునిచ్చారు. -
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాద ఘటన జరిగిందని.. అలాంటిది ప్రభుత్వ అధికారులతోనే విచారణ జరిపిస్తే ఫలితం ఏముంటుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. సింహాచలంపై జరిగిన బాధాకరం. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రచార పిచ్చి ప్రమాదానికి కారణం అయింది. వీఐపీలకు దర్శనం కల్పించడం మీద ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం.మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామన్నారు. సింహాచలంపై ఏడుగురు గురు భక్తులు చనిపోయిన సంఘటన ఎన్నడు జరగలేదు. మరణాలపై చంద్రబాబు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. మరణాలపై ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మరణాలపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపితే ఏమి లాభం?. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ ఎందుకు వేయలేదు. జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే వైఎస్సార్సీపీ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. కమిటీ ముందు కాంట్రాక్టర్ నిజాలు చెప్పాడు. నాలుగు రోజుల్లో గోడ కట్టామని చెప్పారాయన. ఆ గోడకు డిజైన్, టెండర్ లేవు. కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. దేవాలయాలు భక్తులు అంటే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కొండపై 7 మంది చనిపోతే కనీసం శుద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మరణాలు తరువాత సంప్రోక్షణ చేయడం మన సంప్రదాయం. ప్రమాద ఘటనపై పరామర్శకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు?. జనసేన కార్యకర్త అయితేనే పవన్ పరామర్శ చేస్తారా?. మిగతా వారిని పరామర్శించరా?.ప్రభుత్వంలో ఉండి మీరు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం అని బొత్స అన్నారు. -
‘ఆ డ్యామ్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’
రాజంపేట: కూటమి సర్కార్ అన్నమయ్య డ్యామ్ నిర్మాణాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. గతవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డ్యామ్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, అయితే ఆ టెండర్లను ఈ ప్రభుత్వం రద్దు చేసి ఆ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసిందన్నారు.ఈ డ్యామ్ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు సాగునీరు సమస్య తీవ్రమైందన్నారు మిథున్‌రెడ్డి. ఇప్పటికైనా డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి అంటే 13 గ్రామాలే కాదని, రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుపై ఉందన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. -
కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: కులాల వారీగా జనగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ స్వాగతిస్తుందన్నారు పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్. కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా పోతిన పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై తీర్మానం చేశారని గుర్తుచేశారు. ‘అణగారిన వర్గాల అభివృద్ధికి ఈ కుల గణన ఎంతో మేలు చేస్తుంది. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో మేలు చేశారు. కుల గణన కోసం ఆరుగురు అధికారుల తో కమిటీని కూడా జగన్ నియమించారు. దేశంలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అణగారిన వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తి జగన్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అందించడానికి మీ కులం, ప్రాంతం ఏంటి అని అడుగుతున్నారు’ అని పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆనాడు వైఎస్సార్సీపీ తరపున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ.20 వేల సాయం అందిస్తాం. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి సాయం అందించలేదు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో చోటు చేసుకున్న ఉద్యాన పంటల నష్టానికి.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ సముఖత వ్యక్తం చేశారు. 630 మంది రైతులకు హెక్టారుకు రూ. 20 వేల చొప్పున పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందిస్తాం. 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు.‘‘రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ను ఏర్పాటు చేసింది.. కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్‌ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది. ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది. గత నెలలో అరటి ధర ఓ మోస్తారుగా ఉండేది. ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు..మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే.. వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందులను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగిస్తారేమో కానీ.. ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు’’ అని వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గండి క్షేత్రంలో 26 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
‘వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఇదే తేడా..’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని.. సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్ జగన్ కార్మికుల కోసం పనిచేశారన్నారు. గురువారం.. వైఎస్సార్సీపీ టీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు అందించేవారని.. కేసులు, పైన్స్ లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఆటో రోడ్డు ఎక్కితే పైన్స్ వసూళ్లు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు జీవన భృతి కోసం 10 వేలు, గుర్తింపు కార్డు జగన్ ఇచ్చారు. చిరు వ్యాపారులు టీడీపీ నేతలకు ప్రతిరోజు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి వచ్చింది. వైఎస్ జగన్ ఆప్కాస్ పెట్టి మున్సిపల్ కార్మికులను ఆదుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చారు. ఆప్కాస్‌ను కూటమి ప్రభుత్వం తీసేయాలని చూస్తుంది. ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేదు’’ అని అవినాష్ పేర్కొన్నారు.‘‘సంక్షేమం లేదు.. అభివృద్ది లేదు.. ప్రజలను కూటమి ప్రభుత్వ మోసం చేస్తుంది. సింహచలం వంటి ఘటన ఎప్పుడైన జరిగిందా?. తొక్కిసలాట.. తోపులాట ఎప్పుడు జరగలేదు. రాష్ట్రంలో పాలన ఉందా? అనే అనుమానం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుపతిలో చనిపోయారు. ఇప్పుడు సింహాచలంలో చనిపోయారు. రైడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. వైజాగ్ మా నాయకుడు వెళ్లాడు.. మీరు ఒక్కరైన వెళ్లారా?. వైఎస్ జగన్ కట్టిన రక్షణ గోడ లక్షలాది మందిని కాపాడింది. మీరు కట్టిన గోడ నాసిరకంగా కట్టడంతో 8 మంది చనిపోయారు. వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి కార్మికుడికి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ చెప్పారు. -
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు. -
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
సాక్షి, హైదరాబాద్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని, స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఏడుగురు గోడ కూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు.హిందువుల మనోభావాలకు విఘాతం:సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. దేవాలయాల సంరక్షణ, వాటి అభివృద్ధితో పాటు, హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.2014–19 మధ్య కూడా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గంగా పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చడమే కాకుండా, ఆ దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లలో తరలించి హిందువుల మనోభావాలు గాయపర్చారు. ఇంకా గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యాడంటే భక్తులు చనిపోవడం అనేది ఆనవాయితీగా మారింది.ప్రభుత్వ ఉదాసీనత. నాసిరకం పనులు:సింహాచలంలో చందనోత్సవానికి లక్షలాది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. తూతూమంత్రంగా నాసిరకంగా చేసిన పనుల కారణంగానే భక్తుల మరణాలు సంభవించాయి. చందనోత్సవం ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు ఎవరికెన్ని పాసులు పంచుకోవాలని వాదించుకోవడంతోనే సరిపోయింది. అంతే తప్ప, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయం వద్ద భక్తుల రద్దీ తట్టుకునే తగిన ఏర్పాట్లపై ఎవరూ చొరవ చూపలేదు.మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉండి కూడా ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. చివరకు టాయ్‌లెట్ సౌకర్యం కూడా కల్పించక పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఏదో అపచారం:వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు సింహాచలం స్వామివారి దర్శనం కోసం వచ్చి, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వరసగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ఎక్కడో ఏదో అపచారం జరిగిందని మాత్రం అర్థమవుతుంది.పవన్‌కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేయాలి:నాడు ఎక్కడా జరగని అపచారానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆర్భాటంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. హిందూ మతానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ను అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇప్పుడు సింహాచలం, గత జనవరిలో తిరుపతిలో జరిగిన దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా, ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి.అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆలయాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడాలి. తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. చెప్పులేసుకుని దర్శనానికి వస్తున్నారు. బిర్యానీలు తింటున్నారు. టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి రూపంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోతే చడీచప్పుడు కాకుండా కాల్చేశారు. పవన్‌కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా? భక్తులు చనిపోవడం, ఆలయాల్లో అపచారాలు చేయడమేనా మీ ఉద్దేశం?.శిక్షించలేనప్పుడు కమిటీలెందుకు?:తిరుపతిలో తొక్కిసలాటపై దర్యాప్తునకు కమిటీ వేసిన ప్రభుత్వం ఏం తేల్చింది? తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మళ్లీ త్రిసభ్య కమిటీ వేశామంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించలేనప్పుడు కమిటీలు వేసి ఏం ప్రయోజనం? ఆలయాల్లో వరుసగా భక్తులు చనిపోతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదా?. బాధిత కుటుంబాలకు ఏదో పరిహారం ఇచ్చి, క్షతగాత్రులకు వైద్యం చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం సరికాదని, భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. -
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సాక్షి,తాడేపల్లి: సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని.. దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు.‘‘తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి వన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే.. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తోంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్‌పై బురద చల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్‌పై నెట్టేశారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు‘‘దేవుడు ఇలాంటి వన్నీ చూస్తూ ఉంటాడు. ఇన్నేళ్ల చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా?. గోదావరి పుష్కరాల తొక్కిసలాట.. తిరుపతి తొక్కిసలాట.. గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు.. మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వ తీరు ఉంది. మూడు రోజుల క్రితం గోడకట్టడమేంటి?. ముందే కట్టొచ్చుకదా. వీళ్లలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు.. అందుకే ఇలా జరిగింది’’ అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.‘‘అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. తిరుమతి తొక్కిసలాట విచారణ ఏమైంది?. చంద్రబాబు నీ జీవితం ఇంకెప్పుడూ మారదా?. నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా?. ప్రజలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషాలు ఇప్పటికైనా మానుకో.. చంద్రబాబు అతని కొడుకు వంటి వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న చిన్న రోడ్లలో మీటింగ్‌లు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా?. ఈకుల, మత పిచ్చేంటి... చంద్రబాబు ఒక్కరోజైనా మనిషిగా బ్రతకండి. చంద్రబాబు,పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్సీపీనే.అక్టోబర్‌లోగా బూత్ కమిటీలుమే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది. ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే పార్టీ.. పార్టీయే మీరుమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. ప్రజలకు మరింత చేరువవుదాంబాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతసాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటంచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట -పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి20.రాజంపేట- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్)21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్.రమేష్‌రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
శ్రీకృష్ణ లీలలు
ఆయన నవ్వాడంటే అక్కడ శత్రుత్వపు బీజాలు పడినట్టే.. ఆయన కరచాలనం చేశాడంటే.. అక్కడ కేడర్ మధ్య అడ్డుగోడలు కట్టినట్టే.. ఆయన ఆలింగనం చేశాడంటే అక్కడ గ్రూపులు ప్రారంభమైనట్టే.. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ పార్టీలో లుకలుకలు మొదలైనట్టే.. ఇదీ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీరుపై ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్న అభిప్రాయం. పల్నాడులో శ్రీకృష్ణ‘తలభారం’తో తెలుగుదేశం పార్టీకి బొప్పి కడుతోంది. అమ్మో ఈ ఎంపీ మాకొద్దు బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటోంది.సాక్షి, గుంటూరు: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. వర్గపోరుకు కేరాఫ్.. గతంలో వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు పారీ్టలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్‌రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్ రాజకీయాలను పెంచి పోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు. మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు. అందుకే జగన్ పక్కన పెట్టేశారు..వైఎస్సార్ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్ జగన్మోహన్రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు. తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు.టీడీపీలోనూ అదే పంథా.. కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది. = నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. ⇒ ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్ వర్గాన్ని ఆదరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌కే పేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది. ⇒ వినుకొండలో తనతోపాటు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీరి్ణంచుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు. ⇒ మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపారీ్టలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి.