breaking news
-
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. -
చంద్రబాబు వికృత రాజకీయ క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సాక్షి, అమరావతి: రాజకీయం పేరుతో సీఎం చంద్రబాబు సాగిస్తున్న వికృత క్రీడను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉందని పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారు. చంద్రబాబు మాత్రం మీడియా ద్వారా ప్రజలను ప్రలోభపెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. టీడీపీ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, టీడీపీ తిరిగి వారి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ద్వారా వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేసింది.టీడీపీ వాళ్లు చేసిన స్కామ్‌లకు ఆధారాలున్నా వాటిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలు ఆలోచించే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బందిపోట్ల తరహాలో ఇసుక, కాంట్రాక్టులు, నామినేటెడ్ పనుల్లో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రవేశపెట్టి దాని ద్వారా మొదట్లోనే కమీషన్లు దండుకుంటున్నారు. ప్రాజెక్టులు వచ్చినా, రాకపోయినా అడ్వాన్సుల పేరిట దోచుకుంటున్నారు. ఇవి ప్రజల దృష్టిలో పడకుండా డైవర్షన్ కోసం వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అధికారంలో ఉండగా వైఎస్ జగన్ నిబద్ధతతో కూడిన రాజకీయం చేశారు.పేదలకు, సంపన్నులకు మధ్య అంతరాలు తగ్గించడం, నిజమైన ప్రజాస్వామ్యంలో మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడం కోసం ఏం చేయాలో... అది చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్. ఐదేళ్లు జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమాన్ని చూశాం. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతల ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. -
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసింది’
తాడేపల్లి : ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడుతున్నారని ధ్వజమెత్తారు.‘స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొడుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారు?, తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం జగన్ ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు.చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవటం కీసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు’ అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. -
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?
‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్యం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
కుప్పం మున్సిపల్ చైర్సన్ ఎన్నికల అప్డేట్స్..చిత్తూరు..కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీసీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీసంఖ్య బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్న టీడీపీకుప్పం మున్సిపల్ చైర్మన్‌గా సెల్వ రాజ్ ఎన్నిక5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికటీడీపీ చైర్మన్ అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతువైఎస్సార్సీపీ అభ్యర్ధి హఫీజ్‌కు తొమ్మిది మంది మద్దతు, ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరుకుప్పంలో 144 సెక్షన్నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికబెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లుఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంబెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..పోలీసుల కనుసన్నల్లోనే కుప్పంమున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులుఅడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్, 92 మందితో మున్సిపల్ ఎన్నికలు గుంటూరు..నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికబలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వంగుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లువైఎస్సార్సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయంవైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులుఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులుకార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలుమేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్సీపీ..అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 👉ఏపీలో కూటమి సర్కార్ పాలనలో దౌర్జన్యం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.👉వైఎస్సార్సీపీకి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్’
సాక్షి, తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్‌మోడల్‌గా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు.ఇంకా ఆయనేమన్నారంటే..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్‌తో రూ.కోటికి పైగా బ్యాంక్‌ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్‌తో క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్ఫోన్లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్‌లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్ మంజూరయ్యింది.23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్‌కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్‌లో సమర్పించారు.కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారువిజయవాడ, ముంబై కోర్ట్‌ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు.ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్‌షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్‌లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలుజత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్టులో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు.చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్‌లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్‌కు సలహాదారుగా ఉన్న అడ్వకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది.పోలీస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతీశారుకూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది.ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులుతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు.అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి. -
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘బాబూ.. సూపర్ సిక్స్‌కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు. -
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. పల్లెనిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఓ మహిళ ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యే వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానికురాలు రేవతి.. ఎమ్మెల్యే రవికుమార్‌ను నిలదీసింది. కూటమి పాలనను ఎండగట్టింది. ఈ సందర్బంగా బొమ్మాళి రేవతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతీ మహిళకు 15 వందల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. గెలిచాక ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించింది. అలాగే, కొళాయిల్లో మంచినీరు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు వస్తున్నారు. అంతేకానీ, పేదల కోసం మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే, కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనని అరెస్ట్ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
శ్మశాన వాటికనూ వదలని జనసేన నేత.. తిరగబడిన స్థానికులు
సాక్షి, ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పట్టణంలోని ఎల్సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి యత్నించడం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాలకుపైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్ను పడింది. ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. -
‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇవాళ చంద్రబాబు.. మత్సకారుల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని.. ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు కట్టారు?, ఎన్ని పోర్టులు కట్టారు? అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్సకారుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారన్నారు.‘‘గత ప్రభుత్వంలో చేపట్టిన హార్బర్ల పనులు అన్ని అర్ధాంతరంగా ఆపేశారు. మీరు ఈ రోజు అదే ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. రివైజ్ డీపీఆర్ పేరుతో అన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మత్స్యకారులు అంటే చిన్న చూపే. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ జిల్లాకు ఒక హార్బర్ ఉండాలని మొదలు పెట్టి నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్ని పోర్టులు కట్టారు?. ఒక్క పోర్టు కూడా కట్టలేదు. వైఎస్ జగన్ హయాంలో నాలుగు పోర్టులు ప్రారంభమయ్యాయి.మత్స్యకార భరోసా 20 వేలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరి గత సంవత్సరం మత్స్యకార భరోసా బకాయిల పరిస్థితి ఏంటి?. గత టీడీపీ హయాంలో 4 వేల మత్స్యకార భరోసా ఇస్తే.. వైఎస్ జగన్ పాలనలో రూ.10 వేలు రూపాయలు అందించాం. 2023-24 మధ్యలో మత్స్యకార భరోసా బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఐదేళ్ల కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా 3 ఏళ్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది...తక్షణమే ఆపేసిన బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించండి. నువ్వులరేవు హార్బర్ పనులకు అనుమతులు తీసుకురండి. చంద్రబాబుకు పరిపాలన చేతగాక లక్షా యాభై వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేదు. ఉర్సా ట్రస్టు భూములు ఎలా అప్పనంగా ప్రవేట్ కంపెనీలు కట్టబెడతారు?. 6 నెలల క్రితం అమెరికాలో పెట్టిన కంపెనిపై ఎందుకంత ఆసక్తి’’ అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. -
ఇలా చేస్తున్నావేంటి మండలి?.. తెలుగు తమ్ముళ్ల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై అవనిగడ్డ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని టీడీపీ నేతలు బయటపెట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బుద్ధప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ చల్లపల్లిలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.మీ వల్ల నేను గెలవలేదని ఎమ్మెల్యే మమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు మమ్మల్ని గౌరవించేవారు. మమ్మల్ని అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు.ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా.. అధికారులను ఉసిగొల్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని.. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇంఛార్జిని నియమించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక
సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చేబ్రోలు కిరణ్‌ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్‌ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్‌ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్‌లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్‌ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ఏపీలో స్కీములు లేవు.. అన్నీ స్కాములే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో స్కీములు లేవు కానీ.. స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు వారి సన్నిహితులకు కారుచౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కనీసం ఒక టీ కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.అమరావతిలో జి+1 బిల్డింగ్లు కట్టేందుకు అధిక ధరలకు తన అనుంగులకు చంద్రబాబు కట్టబెట్టారు. వారి ద్వారా హైదరాబాద్‌లో ఒక బిల్డింగ్, మంగళగిరిలో పార్టీ కార్యాలయం కట్టించుకున్నారు. టెక్నాలజీ కంపెనీల పేరుతో చంద్రబాబు తన మనుషులకు భూములు దోచిపెడుతున్నాడు. ఊరూ పేరులేని ఉర్సా కంపెనీకి 3 వేల కోట్ల ఖరీదైన భూమిని కట్టబెట్టారు. ఏం అర్హత ఉందని... ఉర్సాకు 59.65 ఎకరాలు కేటాయించారు’’ అంటూ శివశంకర్‌రెడ్డి నిలదీశారు.2024 సెప్టెంబర్ 27వ తేదీన అమెరికాలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యింది. అక్టోబర్‌లో లోకేష్ పర్యటన తర్వాత పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఓ కథ అల్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన భారత దేశంలో ఉర్సా కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో ఉర్సా కంపెనీ కార్యాలయం ఉంది. పది లక్షల రూపాయల మూలధనం పెట్టుబడితో ఉర్సా కంపెనీ పెట్టారు. అరసెంటు భూమి కూడా కేటాయించే అర్హత కూడా ఉర్సాకు లేదు. ఆఫీస్ కూడా లేని ఉర్సాకు మూడువేల కోట్ల రూపాయలు భూములు కట్టబెడతారా?’ అంటూ శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.21st సెంచ్యూరీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి పారిపోయిన వ్యక్తులు అబ్బూరి సతీష్. ఉర్సా కంపెనీ కేటాయింపులపై ఇంత రచ్చ నడుస్తుంటే ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఎందుకు స్పందించరు?. ప్రభుత్వానికి బదులు ఉర్సా కంపెనీ ప్రతిధులు ఎలా సమాధానం చెబుతారు?. ప్రైవేట్ కంపెనీని టీడీపీ పార్టీ ఎందుకు భుజాన వేసుకుంటుంది?. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకోవడం దేనికి?. మూడు వేల కోట్ల రూపాయలు భూములు కేటాయింపులో ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్లాయి? ఈ వాటాల లెక్కలు తేలాల్సిందే’’ అని శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఉర్సాకు భూముల కేటాయింపు అతిపెద్ద కుంభకోణం. ఉర్సా భూ కుంభకోణం పై సీబిఐతో విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎండీసీ 9 వేల కోట్ల రుణంతీసుకున్నారు. రోడ్లను సైతం ప్రైవేట్ పరం చేస్తోంది. రాజధానిలో ప్రజల సొమ్ముతో చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని శివశంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
కేశినేని నానిపై పరువు నష్టం దావా.. టీడీపీ ఎంపీ చిన్నికి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.‘‘విజయవాడ ప్రజలు నాకు పది ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయతీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతీ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు. విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి.. నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, అక్రమాలపై ఆరోపణలు, ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశిస్తాం. కానీ బెదిరింపులు కాదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. నేని దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. నేను భయంతో కాదు.. వాస్తవాలతో స్పందిస్తాను.. రాజీ పడను. సత్యం బెదిరింపులకు భయపడదు.. నేను కూడా భయపడను’’ అంటూ కేశినేని నాని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్‌లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.