ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు | acb rides on utnoor ITDA EE ramesh houses | Sakshi
Sakshi News home page

ఉట్నూర్ ఐటీడీఏ ఈఈ ఇంటిపై దాడులు

Jan 12 2018 11:59 AM | Updated on Aug 17 2018 2:56 PM

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఈఈ రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఘా పెట్టిన ఏసీబీ శుక్రవారం తనిఖీలు చేపట్టింది.  

హైదరాబాద్, వరంగల్‌, ఉట్నూరు సహా 8 చోట్ల అవినీతి నిరోధక శాఖ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, గడిచిన రెండేళ్లుగా రమేష్‌ ఐటీడీఏ ఈఈగా పని చేస్తున్నారు. గతంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement