సాక్షి, తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణం చేశారు. సతీశన్‌తో గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. డిప్యూటీ సీఎంలతో పాటు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు.
సతీశన్ ప్రభుత్వంలో మంత్రులుగా 21 మంది ప్రమాణం చేశారు. వాళ్లలో సీఎం రేసులో భంగపడ్డ చెన్నితల్ రమేశ్ కూడా ఉన్నారు. కున్‌హల్‌కుట్టి, మురళీధరన్, షాజీ, అబ్దుల్ గఫర్, బషీర్, మోన్స్ జోసెఫ్.. ఇతరులు ఉన్నారు. అలాగే ఆయన కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు లభించింది. తులసి, బిందు కృష్ణలు మంత్రులుగా ప్రమాణం చేశారు.


