తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్‌ మదర్..! | Sreeleela Mother Clarity On Dating Rumours With Cricketer Tilak Varma | Sakshi
Sakshi News home page

Sreeleela: తిలక్ వర్మతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన హీరోయిన్‌ తల్లి..!

May 18 2026 9:05 AM | Updated on May 18 2026 10:00 AM

Sreeleela Mother Clarity On Dating Rumours With Cricketer Tilak Varma

కన్నడ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి సందడి మూవీతో  టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ.. స్టార్ హీరోల సరసన మెప్పించింది. రవితేజ ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌ హీరో ధనుశ్‌తో ఓ సినిమా చేస్తోంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. శ్రీలీల వ్యక్తిగత జీవితంపై ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమె తెలుగు క్రికెటర్ తిలక్ వర్మతో డేటింగ్‌లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఐపీఎల్ మ్యాచ్‌కు శ్రీలీల హాజరు కావడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్‌ వైరల్‌గా మారింది. గతేడాదిగా వీరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నప్పటికీ ఎవరూ కూడా స్పందించలేదు.

తాజాగా ఈ వార్తలపై హీరోయిన్ శ్రీలీల మదర్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల తల్లి కొట్టిపారేసింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఫుల్ క్లారిటీ ఇ‍చ్చేసింది. అసలు ఇప్పటి వరకు శ్రీలీల- తిలక్ వర్మ ఒక్క సారి కూడా కలుసుకోలేదని  శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేసింది. 2025 డిసెంబర్‌లో శ్రీలీల-తిలక్‌ ఇద్దరూ తిరుమలను సందర్శించడం.. అలాగే వాంఖడే టీ20 మ్యాచ్‌లో నటి సందడి చేయడం.. ఇవి రెండూ ఉద్దేశపూర్వకంగా జరగలేదని ఆమె అన్నారు. గతంలో కార్తీక్ ఆర్యన్‌తో వచ్చిన డేటింగ్ వార్తలను సైతం కొట్టిపారేశారు. కార్తీక్ వాళ్ల మదర్‌ డాక్టర్‌ కావడంతోనే వృత్తిపరంగా కలిశామని క్లారిటీ ఇచ్చారు. దీంతో హీరోయిన్‌పై డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement