USA Cricket Team
-
మతి తప్పిన నేపాల్ క్రికెటర్.. ముందుంది ముసళ్ల పండగ!
నేపాల్ స్టార్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికీ అంపైర్ ఔట్‌గా ఇవ్వడంపై రోహిత్ పోడెల్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ మిలింద్ కుమార్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలం కావడంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే మిలింద్ కుమార్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. బంతి ప్యాడ్లకు తాకలేదని ఒకవైపు రోహిత్ చెబుతూనే ఉన్నప్పటికీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్‌కు గురైన రోహిత్ పౌడెల్ అంపైర్‌వైపు కోపంగా చూశాడు. ఆ తర్వాత బ్యాట్‌ను పిచ్‌పై బలంగా కొట్టి చేసేదేం లేక నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో బంతి ప్యాడ్లను తాకలేదు, కానీ గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత తిట్టడం, బ్యాట్‌ను పడేయడం, బ్యాట్‌తో మైదానాన్ని కొట్టుకుంటూ వెళ్లడం, బౌండరీ లైన్‌ను కాళ్లతో తన్నడం వంటివి నిషిద్ధం. అయితే రోహిత్ పౌడెల్ బ్యాట్‌ను బలంగా పిచ్‌కు కొట్టడంతో నిబంధన ఉల్లఘించినట్లయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లఘించిన రోహిత్ పౌడెల్పై లెవెల్ 1 లేదా లెవెల్ 2 కింద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అమెరికాపై నేపాల్ 122 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇషాన్ పాండే (84), దీపేంద్ర సింగ్ (59) అర్థసెంచరీలతో రాణించగా.. రోహిత్ పౌడెల్ (46), ఆసిఫ్ షేక్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభమ్ రంజనే మూడు వికెట్లు తీశాడు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 41.2 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి (56) అర్థసెంచరీతో రాణించాడు. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచ్చానే 3 వికెట్లు తీయగా, లలిత్, దీపేంద్ర సింగ్, గుల్షన్ జా తలా రెండు వికెట్లు పడగొట్టారు. There have been no shortage of poor umpiring decisions during the ongoing ODI tri series in Nepal. Add this from today to the list. Nepal captain Rohit Paudel given lbw on a ball that never hit his pads, appeal upheld from USA bowler Milind Kumar on gloved sweep into the ground. pic.twitter.com/KN9PwL1s7A— Peter Della Penna (@PeterDellaPenna) May 22, 2026చదవండి: ఉగ్రవాదితో షాహిద్ అఫ్రిది డిన్నర్! -
టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. కొన్నిరోజుల క్రితం టీమిండియాపై అద్బుతంగా ఆడిన అమెరికా జట్టు.. ఇప్పుడు పాక్‌పై కూడా అదే జోరు ప్రదర్శించింది. కానీ గెలుపు రుచిచూడలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరు చేసింది. ఫర్హాన్ 73 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బాబల్ ఆజమ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.అనంతరం అమెరికా జట్టు.. దూకుడుతో ఛేదన మొదలుపెట్టింది. కానీ వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ.. 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభం రంజనే 51, షయన్ జహంగీర్ 49 పరుగులతో మెప్పించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్ 3, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. -
IND vs USA: 'సమ్'తృప్తికర ఆరంభం
అభిషేక్ శర్మ డకౌట్... పవర్‌ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 63 పరుగులు సాధించాడు. ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్‌లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్ భారత బ్యాటింగ్‌కు చిన్న హెచ్చరికను జారీ చేసింది. ముంబై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 29 పరుగుల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్ షాక్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిలింద్ కుమార్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. భారత్ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది. సూర్యకుమార్‌కు లైఫ్... హిట్టర్ అభిషేక్ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్’ కాగా... ఇషాన్ కిషన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నేత్రావల్కర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో తిలక్ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్ ఓవర్లో ఇషాన్ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్విక్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్ కిషన్ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్ దూబే (0) అవుటయ్యారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్‌స్పిన్నర్ మొహసిన్ బౌలింగ్‌లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా, హార్దిక్ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్ తన బౌలింగ్‌లోనే సూర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్ లభించింది. దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్ ఓవర్లో సూర్య, అక్షర్ పటేల్ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు. సిరాజ్‌కు 3 వికెట్లు.. ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస ఓవర్లలో గూస్ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్ పటేల్ (0) వికెట్ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్‌ను అవుట్ చేసి వరుణ్ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్... అనూహ్యంగా వరల్డ్ కప్ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు... అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్ నేత్రావల్కర్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్‌లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్‌ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్–19 క్రికెట్‌ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రంజనే చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్‌కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్‌తో నెరవేరింది. మ్యాచ్‌లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) మిలింద్ (బి) షాల్విక్ 20; అభిషేక్ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్ 0; తిలక్ వర్మ (సి) మోనాంక్ (బి) షాల్విక్ 25; సూర్యకుమార్ (నాటౌట్) 84; దూబే (సి) నేత్రావల్కర్ (బి) షాల్విక్ 0; రింకూ (సి) మిలింద్ (బి) మొహసిన్ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్ 5; అక్షర్ (సి) మొహసిన్ (బి) హర్మీత్ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్ (బి) షాల్విక్ 4; వరుణ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్: సౌరభ్ నేత్రావల్కర్ 4–0–65–0, అలీ ఖాన్ 2–0–13–1, షాల్విక్ 4–0–25–4, మొహసిన్ 4–0–16–1, శుభమ్ 2–0–16–0, హర్మీత్ 4–0–26–2. అమెరికా ఇన్నింగ్స్: గూస్ (సి) తిలక్ (బి) సిరాజ్ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్ (బి) సిరాజ్ 2; మోనాంక్ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) వరుణ్ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్ 37; శుభమ్ (ఎల్బీ) (బి) సిరాజ్ 37; హర్మీత్ (సి) సిరాజ్ (బి) అక్షర్ 0; మొహసిన్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 8; షాల్విక్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్ 4–0–29–3, వరుణ్ 4–0–24–1, అక్షర్ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.టి20 ప్రపంచకప్‌లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి ఇంగ్లండ్X నేపాల్ వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచిశ్రీలంక X ఐర్లాండ్వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నం.. యువ క్రికెటర్‌పై ఐసీసీ బ్యాన్
అంతర్జాతీయ క్రికెట్లో యూఎస్ఏ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్‌స్పిన్నర్ బొడుగం అఖిలేష్ రెడ్డి అబుదాబి టి10 లీగ్‌లో ఆడుతూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను అతను ఉల్లంఘించినట్లు వెల్లడైంది.25 ఏళ్ల అఖిలేష్ రెడ్డిపై మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ... అతడిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అఖిలేష్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది. విచారణ ముగిసిన అనంతరం అతనిపై పూర్తి స్థాయిలో చర్యలుంటాయి.అబుదాబి టి10 లీగ్‌లో అస్పిన్ స్టాలియన్స్ జట్టు తరఫున బుధ, గురువారాల్లో అతను 2 మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అఖిలేష్ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో నార్త్ అమెరికా టి20 కప్‌లో యూఎస్ తరఫున అరంగేట్రం చేసి 4 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్ -
యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్
దుబాయ్: యూఎస్ఏ క్రికెట్ (USA Cricket) సభ్యత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వేటు వేసింది. ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ఏ క్రికెట్ బోర్డు విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకుంది. కాగా, ఏడాది పాటు సమీక్షలు జరిపిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.అయితే, 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ఏ ఒలింపిక్, పారా ఒలింపిక్స్ కమిటీ గుర్తింపు పొందడానికి యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వైఖరి అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని మండిపడింది.ఇది కూడా చదవండి: భారత్‌కు ఎదురుందా!ఇదే సమయంలో, ఒలింపిక్స్, ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, సస్పెన్షన్ దురదృష్టకరమని పేర్కొంది. క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఇది అవసరమైన చర్య అని ఐసీసీ పేర్కొంది. అమెరికాలో ఆటగాళ్లను రక్షించడం, క్రీడను అభివృద్ధి చేయడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.🚨 USA suspension Clarity 🚨 Despite the suspension, the USA men’s team remains eligible and will participate in the upcoming ICC T20 World Cup. The ICC clarified that the suspension affects governance, not team eligibilityUSA Cricket was suspended by the ICC due to serious… pic.twitter.com/3nKLk63kbf— Vipin Tiwari (@Vipintiwari952) September 23, 2025 -
సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110 బంతుల్లో 155 నాటౌట్; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్–2లో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), హమీద్ (43 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్, నోస్తుష్ చెరో మూడు వికెట్లు తీశారు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!


