నేపాల్ స్టార్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికీ అంపైర్ ఔట్‌గా ఇవ్వడంపై రోహిత్ పోడెల్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 38వ ఓవర్ మిలింద్ కుమార్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలం కావడంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే మిలింద్ కుమార్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. బంతి ప్యాడ్లకు తాకలేదని ఒకవైపు రోహిత్ చెబుతూనే ఉన్నప్పటికీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్‌కు గురైన రోహిత్ పౌడెల్ అంపైర్‌వైపు కోపంగా చూశాడు.
ఆ తర్వాత బ్యాట్‌ను పిచ్‌పై బలంగా కొట్టి చేసేదేం లేక నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో బంతి ప్యాడ్లను తాకలేదు, కానీ గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత తిట్టడం, బ్యాట్‌ను పడేయడం, బ్యాట్‌తో మైదానాన్ని కొట్టుకుంటూ వెళ్లడం, బౌండరీ లైన్‌ను కాళ్లతో తన్నడం వంటివి నిషిద్ధం.
అయితే రోహిత్ పౌడెల్ బ్యాట్‌ను బలంగా పిచ్‌కు కొట్టడంతో నిబంధన ఉల్లఘించినట్లయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లఘించిన రోహిత్ పౌడెల్‌పై లెవెల్ 1 లేదా లెవెల్ 2 కింద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అమెరికాపై నేపాల్ 122 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇషాన్ పాండే (84), దీపేంద్ర సింగ్ (59) అర్థసెంచరీలతో రాణించగా.. రోహిత్ పౌడెల్ (46), ఆసిఫ్ షేక్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభమ్ రంజనే మూడు వికెట్లు తీశాడు.
అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 41.2 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి (56) అర్థసెంచరీతో రాణించాడు. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచ్చానే 3 వికెట్లు తీయగా, లలిత్, దీపేంద్ర సింగ్, గుల్షన్ జా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
There have been no shortage of poor umpiring decisions during the ongoing ODI tri series in Nepal. Add this from today to the list. Nepal captain Rohit Paudel given lbw on a ball that never hit his pads, appeal upheld from USA bowler Milind Kumar on gloved sweep into the ground. pic.twitter.com/KN9PwL1s7A
— Peter Della Penna (@PeterDellaPenna) May 22, 2026


