RCB vs PBKS
-
ఒంటరిగా డగౌట్లో రిక్కీ పాంటింగ్.. ఫొటో వైరల్
ఐపీఎల్-2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత డీలా పడింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలై.. వరుసగా ఆరో పరాజయం నమోదు చేసింది. తద్వారా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక పంజాబ్ టాప్-4 చేరాలంటే మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌లో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.‘ప్లే ఆఫ్స్’లో ఆర్సీబీమరోవైపు.. ధర్మశాలలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు ఐపీఎల్ 19వ సీజన్లో ‘ప్లే ఆఫ్స్’కు దూసుకెళ్లింది. ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 73 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశారు.పంజాబ్ ఆరో‘సారీ’అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రేయస్ అయ్యర్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి అంచనాలు పెంచిన పంజాబ్‌కిది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకం సాధించగా... కూపర్ కనోలి (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టొయినిస్ (25 బంతుల్లో 37; 5 ఫోర్లు), సూర్యాంశ్ షెడ్గే (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) విఫలమవడంతో పంజాబ్‌కు పరాజయం తప్పలేదు. భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టగా... రసిఖ్ సలామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫొటో వైరల్ఇక ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపించింది. ఒంటరిగా.. డగౌట్లో ముందు కుర్చీపై తలవాల్చి ఉన్న పాంటింగ్ ఫొటో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అశూ ఏమన్నాడంటే...‘‘ఈరోజు టీవీలో ఓ శక్తిమంతమైన ఫొటో చూశాను. రిక్కీ పాంటింగ్ డగౌట్లో ఒక్కడే కూర్చుని కుర్చీ మీద ఒరిగిపోయాడు. తన మనసులో ఆందోళన చెలరేగుతూ ఉంటుంది. ఆరంభంలో వాళ్లు టేబుల్ టాపర్‌గా ఉన్నారు. కానీ ఆ తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్.. సెకండ్ హోం గ్రౌండ్ ధర్మశాలలో మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది.చిన్న తప్పిదాల వల్ల కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రిక్కీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ తీవ్రమైన బాధలో ఉండి ఉంటారు. నాకూ బాధగానే ఉంది. అయినా నిజాన్ని అంగీకరించకతప్పదు’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 23న ఏకనా స్టేడియంలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది పాంటింగ్ మార్గనిర్దేశనం.. శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై స్పష్టమైన సంకేతాన్నిచ్చిన ధోని -
మందు మానేశా...ఇక సత్తా చూపిస్తా!
గొప్పగొప్ప లక్ష్యాలు కూడా సమాధి కావడానికి చిన్న చిన్న వ్యసనాలు చాలు. కొండంత బలం వృధా కావడానికి గోరంత బలహీనత చాలు. మరీ ముఖ్యంగా అత్యంత క్రమశిక్షణ, ఏకాగ్రత అవసరమైన క్రీడా రంగంలో బలహీనతలు, దురలవాట్లు ఉండడం అంటే అది చేజేతులా భవిష్యత్తును పాడె ఎక్కించడమే అనాలి. మాజీ టాప్ క్రికెటర్ వినోద్ కాంబ్లి లాంటి వాళ్ల జీవితాలు దీనికో నిదర్శనంగా నిలుస్తున్నాయి కూడా!!ఈ నేపథ్యంలో తాను మద్యం అలవాటును మానుకున్నానని, ఇకపై తన పూర్తి సమయం క్రికెట్‌కే కేటాయిస్తానని ప్రముఖ భారత క్రికెటర్, స్పిన్నర్ ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ ప్లేయర్ అయిన యజ్వేంద్ర చహల్ చెబుతున్నాడు.ఇటీవల తన మాజీ ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ షోలో చహల్ ఈ విషయం గురించి మాట్లాడాడు. ఒకనాటి తన బలహీనతని, అది తనకు కలిగించిన నష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించాడు.తరచూ ఆరోగ్య సమస్యలుగతంలో తాను తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నానని చహల్ చెప్పాడు. మరీ ముఖ్యంగా గాయాల కారణంగా తన క్రీడా నైపుణ్యాలను తగిన విధంగా ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. ‘‘కొన్ని సార్లు నా మీద నాకే నిరాశ కలిగిన మాట వాస్తవం. కేకేఆర్ మ్యాచ్ తర్వాత నా పక్కటెముక విరిగింది, ఆ తర్వాత నా కాలి వేలి కీలు కూడా విరిగింది. అందుకే సెమీఫైనల్, ఫైనల్లో నేను నా సరైన లెగ్–స్పిన్ బౌలింగ్ చేయలేకపోయాను’’ అని చహల్ గుర్తు చేసుకున్నాడు.‘‘ఈ ఏడాది నేను ముందుగా నా శరీరం గురించి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. రాబోయే సీజన్ లో నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపైనే దృష్టి పెట్టా’’ అని చహల్ వెల్లడించాడు. మద్యం మానేశానుదీనికి అనుగుణంగా తీసుకున్న తన నిర్ణయాలను గురించి చెబుతూ... తాను మద్యం మానేసినట్లు తెలిపాడు. దానికి కారణం తన వయస్సు తో పాటు పంజాబ్ కింగ్స్ కోసం మరింత బాగా రాణించాలనే తన ఆలోచనే అని చహల్ ఈ సందర్భంగా చెప్పాడు.‘ఇప్పుడు కాదు.. నిజానికి నేను మద్యం తాగడం మానేసి ఆరు నెలలకు పైగా అయింది. నాకు ఇప్పుడు 35 ఏళ్లు, కాబట్టి నా చురుకుతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నా జట్టు కోసం నూటికి నూట యాభై శాతం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక సీనియర్ ఆటగాడిగా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను’ అని చహల్ తన ఆలోచనల్ని ఏకరవు పెట్టాడు.ఈ సందర్భంగా గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన ఫైనల్‌పై కూడా చహల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. యాన్సెన్ లేకపోవడం వల్లేఆ ఓటమికి గల కారణాలలో తమ బౌలింగ్ ఆల్–రౌండర్ మార్కో యాన్సెన్ లేకపోవడం కూడా ఒకటని అతను విశ్లేషించాడు. జాన్సెన్ 14 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టినప్పటికీ, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుని ఐపీఎల్ జూన్ నెలకు వాయిదా పడటంతో, యాన్సెన్ క్యాంప్ విడిచిపెట్టి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సన్నద్ధమయ్యేందుకు దక్షిణాఫ్రికాతో చేరవలసి వచ్చింది.‘ఫైనల్లో మార్కో యాన్సెన్ గనక ఉండి ఉంటే, ఖచ్చితంగా టైటిల్ గెలిచి ఉండేవాళ్ళం. టోర్నమెంట్ అంతటా అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతం, బ్యాటింగ్‌లో కూడా చివరిలో రెండు మూడు సిక్సర్లు కొట్టగల సత్తా అతనికి ఉంది. అతను బౌలింగ్ చేస్తున్న తీరు వల్ల ఇప్పుడు మాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని చహల్ చెప్పాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!


