బందోబస్తు మధ్య అంత్యక్రియలు | Surpunch Crimiations With Police Protection | Sakshi
Sakshi News home page

Apr 24 2018 10:52 AM | Updated on Apr 24 2018 10:57 AM

Surpunch Crimiations With Police Protection - Sakshi

ఉపసర్పంచ్‌ అంతిమయాత్ర

ముత్తారం(మంథని): మంథని– పెద్దపల్లి ప్రధాన రహదారిపై లద్నాపూర్‌ ఎస్సీకాలనీ వద్ద ఆదివారం సాయంత్రం ఇసుకలారీ ఢీకొని మృతిచెందిన ఆదివారంపేట ఉపసర్పంచ్‌ ఎలువాక రాజయ్య అంత్యక్రియలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాజయ్య మృతితో ఆగ్రహించిన స్థానికుల సుమారు 200 పైగా లారీలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. రాజయ్య అంత్యక్రియల సమయంలో మరేదైనా ఘటన జరుగకుండా లద్నాపూర్, రాజాపూర్‌ గ్రామాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, రామగుండం ఏసీపీ రక్షిత కె.మూర్తి నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీటీసీ చొప్పరి సదానందం, ఎంపీపీ అత్తె చంద్రమౌళి, సర్పంచ్‌ మైదం కుమార్, ఎంపీటీసీలు వనం రాంచెందర్‌రావు, కన్నూరి విజయనర్సింగరావు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement