భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రీడాజీవితంలో ఈరోజు (సెప్టెంబర్ 9) చాలా ప్రత్యేకం. 25 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మాస్టర్ బ్లాస్టర్ వన్డేల్లో తన మొట్టమొదటి సెంచరీ సాధించాడు. అయితే తొలి సెంచరీ సాధించడానికి ఐదేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1989లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన సచిన్ 1994, సెప్టెంబర్ 9న మొదటి సెంచరీ సాధించాడు. 78 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే తొలి శతకం అతడి ఖాతాలో పడింది.