టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి యంత్రం కాదని, అతను కూడా మనిషేనని కోచ్ రవిశాస్త్రి ఘాటుగా వ్యాఖ్యానించాడు. మెడ గాయం కారణంగా కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు కోహ్లితో ఒప్పందం చేసుకున్న సర్రే క్రికెట్ క్లబ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది.