టీడీపీ నాయకులు పసుపు చొక్కాలు వేసుకుని పోలింగ్ బూత్‌ల వద్ద ప్రచారాలు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే రీపోలింగ్ అంటున్న చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందన్నారు.