ప్రత్యేక హోదాపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్షాదక్షత చూసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భయం పట్టుకుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అందుకే సీఎం దొంగ నాటకాలు, దీక్షలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను చేసిన అవినీతికి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్తాననే భయం చంద్రబాబులో ఉందని, అందుకే అందరూ తనకు కాపలా ఉండాలని ప్రజలను అడుగుతున్నారంటూ అనిల్ ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతి అందరికి తెలిసిపోయిందని, జైల్లో కూర్చోపెట్టే దాకా ప్రజలు ఎవరూ నిద్ర కూడా పోరని వ్యాఖ్యానించారు