బాబు నాయుడి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు | YSRCP Leader YS Sharmila Election Campaign Act Gudivada | Sakshi
Sakshi News home page

బాబు నాయుడి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు

Apr 2 2019 6:04 PM | Updated on Mar 20 2024 5:03 PM

తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఐదేళ్లు హోదాకోసం పోరాటం చేయకుండా.. ఎన్నికలు వస్తున్న వేళ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మాట.. పూటకోవేషం తీరు అన్న విధంగా చంద్రబాబు తీరుందని ధ్వజమెత్తారు. అద్భుతమైన పరిపాలన ఇచ్చి, పేదలను ఆదుకున్న రికార్టు వైఎస్సార్‌కే చెందుతుందని ఆమె గుర్తుచేశారు. ఎలాంటి తారతమ్య భేదం లేకుండా పాలన చేశారని అన్నారు. సీఎం అంటే అలా ఉండాలని.. బాబు అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కూడా విడుదల చేయట్లేదని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement