అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మనం చూసింది ఒక్కటేనని అదే మోసం.. మోసం.. మోసం అని అది తప్పా ఇంకోటి చూడలేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ విజయవాడ సభలో ప్రసంగిస్తూ.. ఈ ఐదేళ్లలో అవినీతి, అబద్దాలు, మోసం అనేవే చూశామని అన్నారు. అమరావతి రాజధానిని తానే కడతానని చెప్పిన బాబు.. పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.