68 గజాల దూరం నుంచి గోల్‌ | Wayne Rooney Scores Stunning Goal | Sakshi
Sakshi News home page

68 గజాల దూరం నుంచి గోల్‌

Jun 27 2019 9:27 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఫుట్‌బాల్‌ ఆటలో గోల్‌ కొట్టడం మామూలు విషయం కాదు. ఒక్కోసారి గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపంలో ఉన్నా కూడా గోల్‌ కొట్టడం సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 68 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు వేన్‌ రూనీ. ఒకప్పుడు ఇంగ్లండ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన రూనీ రిటైరయ్యాక క్లబ్బులు, లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్‌ లీగ్‌ సాకర్‌లో డీసీ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా లాస్‌ ఏంజెల్స్‌లో ఓర్లాండో సిటీతో జరిగిన మ్యాచ్‌లో రూనీ దాదాపు 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement