అధికార మదంతో టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నాగరాజు మినహా మిగిలిన వారికి పరిస్థితి విషమం ఉంది. వీరు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉండడం, పార్టీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గ్రామంలో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయడంతోపాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేస్తుండటం వల్లే టీడీపీ నేతలు కక్షతో దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.