‘ముఖ్యమంత్రి చంద్రబాబు నా కజిన్.. లోకేశ్ నాకు బాగా క్లోజ్..’ అని పారిశ్రామికవేత్తలను పరిచేయం చేసుకుంటాడు. ‘నేను టీడీపీ ఆర్థిక విభాగం అధ్యక్షుడిని.. బాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలోనూ నాకు వాటాలున్నాయ్.. అప్పట్లో ఆయన పాదయాత్రకు గాను అంతా నేనే చూసుకున్నా..’ అని చెబుతూ చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఆయనతో దిగిన ఫొటోలు కూడా చూపిస్తూ.. వారిని బుట్టలో వేసుకుంటాడు.