మాదాపూర్‌లో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తోట సంయుక్త(17) బుధవారం అర్థరాత్రి కాలేజ్ హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంయుక్త స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రణంపల్లె గ్రామం. సంయుక్త తండ్రి రాజేందర్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.