ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏబీవీ రావు సెస్పెండ్‌పై ట్విట్టర్ వేదికగా సజ్జల స్పందించారు. వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలులో దళారీగా పనిచేశారన్నారు.