అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాలకు చెందిన ఆరు ఆదివాసీ జాతల వారికి శాశ్వత నివాస పత్రాలు జారీ చేయాలంటూ ఉన్నతాధికార కమిటీ చేసిన సిఫార్సుకు వ్యతిరేకంగా ఆరుణాచ్ ప్రదేశ్ ఆదివాసీలు గత శుక్రవారం నుంచి చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, ఆందోళనను అరికట్టేందుకు భద్రతా బలగాలు జిరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించడం తెల్సిందే. దీనిపై స్పందించిన 24 ఏళ్ల యువ సంగీత దర్శకుడు, ర్యాప్ సింగర్ కెఖో తియామ్‌ఖో శనివారం నాడు ర్యాప్ శైలిలో ఓ పాట రాసి దానికి బాణి కూర్చి పాడారు.