భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అసెంబ్లీ భవన్ ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి తన కన్నతల్లి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ సైకోలాగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులు ఉన్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేకుంటే తన తల్లిని చంపేస్తానంటూ గట్టిగట్టిగా అరిచాడు. తన దగ్గరకు రావాలని చూసిన వారిని కత్తితో బెదిరించాడు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.