గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో టీడీపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని భ్రమరావతిని చేసిన చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేయమని టీడీపీ సవాళ్లు విసిరింది. అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు సిట్ వేస్తే కక్ష అంటున్నారు.