పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు నాయుడు... కాపు రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. శాస్త్రీయత లేని నివేదికలను ఆధారంగా చేసుకొని తీర్మానాలు చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.