నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిజాయితీపరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని సవాలు విసిరారు. అవినీతి, అక్రమాలకు పాల్పడటం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. బయట మాత్రం నిప్పునంటూ చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిపై ఆయనకు మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపాలని ఆ పార్టీలు కూడా డిమాండ్ చేయాలన్నారు.