ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమిళనాడు పర్యటనకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి చెన్నై చేరుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే ఆయన తమిళనాడుకు వెళ్లారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌తో కేసీఆర్ సోమవారం సాయంత్రం సమావేశమవుతారు.