మహాపాదయాత్రతో కదం తొక్కిన అన్నదాతలు | Farmers Reached Maharashtra | Sakshi
Sakshi News home page

మహాపాదయాత్రతో కదం తొక్కిన అన్నదాతలు

Mar 12 2018 7:19 AM | Updated on Mar 21 2024 7:54 PM

అఖిల భారతీయ కిసాన్‌ సభ (ఏబీకేఎస్‌) ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టిన మహాధర్నా ఆదివారం ముంబైకి చేరింది. సుమారు 35 వేల మంది రైతులు పాల్గొంటున్న ఈ ర్యాలీకి అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు పలికాయి. రైతులంతా సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ 35 వేల మంది రైతులు నాసిక్‌ నుంచి ముంబైకి పాదయాత్రగా బయలుదేరిన సంగతి తెలిసిందే. రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలుచేయాలన్నది రైతుల ప్రధాన డిమాండ్‌.

Advertisement
 
Advertisement
Advertisement