మంచి పిల్లలు ప్రధానిని తిట్టొద్దు | Elections 2019, Priyanka Gandhi is Response To Children Abusing PM Modi Splits Twitter | Sakshi
Sakshi News home page

మంచి పిల్లలు ప్రధానిని తిట్టొద్దు

May 1 2019 3:11 PM | Updated on Mar 22 2024 10:40 AM

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జి ప్రియాంకా గాంధీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సోదరుడు కాంగ్రెస్‌పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కొంత మంది చిన్నారులు ఆమె చుట్టూ చేరి రాహుల్‌ గాంధీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. దీనికి ఆమె ఎంతో పులికించి పోయారు. దీంతో ఆ చిన్నారులు శృతి మించి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ‘చౌకీదార్‌ చోర్‌’  అనే నినాదాలతో పాటు.. అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో వారి నినాదాలను ప్రియాంకా అడ్డుకున్నారు.

‘యే వాలా నహీ... అచ్చా నహీ లగేగా. అచ్చే బచ్చే బనో ( అలా అనవద్దు. ఇది బాలేదు.. మంచి పిల్లలు ఇలా చేయరు) అంటూ  పిల్లలను అడ్డుకోవడంతో వారు రాహుల్‌ జిందాబాద్‌ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. చాలా మంది ఈ విషయంలో ప్రియాంకా గాంధీని కొనియాడుతుండగా.. బీజేపీ నేతలు మాత్రం ప్రచారంలో భాగమేనని కొట్టిపారేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ వీడియోను షేర్‌ చేస్తూ ప్రియాంక గాంధీపై మండిపడింది. ప్రియాంకా గాంధీ పిల్లలను అడ్డుకుంటున్నది మాత్రమే వీడియోలో ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement