ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు కొనసాగనుంది.