చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారంటూ కొన్ని పత్రికలు రోజూ ఊదరగొడుతున్నాయని, కొంతయినా వాస్తవాలు రాస్తే బాగుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబుపై కొన్ని పత్రికాలు, టీవీ ఛానళ్లు రాస్తున్న కథనాలను చూస్తే తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. మే 23న వెలువడే ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని, చంద్రబాబును ఎవరూ పిలువకపోయినా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని చెప్పారు.