ఎన్నికల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్‌లో సృష్టించిన అరాచకాలకు సంబంధించిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలోని పోలింగ్ బూత్‌లోకి దౌర్జన్యంగా చొరబడ్డ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరించడమే కాకుండా తలుపులు మూసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం తెలిసిందే.