కన్నీళ్లు ఆపుకోలేకపోయా :ఆనంద్‌ మహీంద్ర

పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెండు చేతులు లేని ఓ చిన్నారి కాళ్ల సహాయంతో ఆహారం తినేందుకు చేస్తున్న ప్రయత్నం తనలో ఆశావాదాన్ని పెంపొందిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘ నా మనవడిని ఇటీవలే కలిశాను. కానీ ఈ వాట్సాప్‌ పోస్టు చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. జీవితం అనేది ఎన్నో సవాళ్లతో, ప్రతికూలతలతో నిండి ఉంటుంది. అయితే ఆ బహుమతిని ఏ విధంగా మలచుకున్నామనే విషయం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఫొటోలు చూసినపుడు నాలో ఆశావాదం పెంపొందుతుంది. నూతనోత్సాహాన్ని నింపుతుంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top