తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 14400 స్పందన టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి