విమానంలో 11నెలల శిశువుకు అస్వస్ధత | Sakshi
Sakshi News home page

విమానంలో 11నెలల శిశువుకు అస్వస్ధత

Published Wed, Sep 26 2018 10:20 AM

విమానంలో ఊపిరాడక 11 నెలల శిశువు మృతిచెందడం అందరిని కలిచివేసింది. ప్రయాణికులు అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు. అయితే ముందస్తుగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో డాక్టర్‌ను, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్‌ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు నిర్దారించిన వైద్యులు.. శ్వాస ఆడకనే చనిపోయినట్లు తెలిపారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement