పంది పిల్లని ఎలా రెడీ చేశారో ...ఫన్నీ వీడియో

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే జంతువులు ప్రధాన పాత్రల్లో తెలుగు తెరపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే తొలిసారిగా ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను రూపొందిస్తున్నారు రవిబాబు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా త్వరలో రిలీజ్ కు అవుతోంది. ఈ సందర్భంగా రవిబాబు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

షూటింగ్ సమయంలో బంటీ (పంది పిల్ల)ని దర్శకుడు ఎలా రెడీ చేశారో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లుతోముతూ కనిపించారు. అదుగో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top