భరత్‌ అనే నేను అన్‌సీన్‌ వీడియోస్‌ | Bharat Ane Nenu unseen videos | Sakshi
Sakshi News home page

భరత్‌ అనే నేను అన్‌సీన్‌ వీడియోస్‌

May 5 2018 10:30 AM | Updated on Mar 21 2024 7:44 PM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా భరత్‌ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్‌ అవుతోంది. తాజాగా సూపర్‌ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్‌ చేశారు.

నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్‌ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస‍్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement