నంబర్‌వన్ కోహ్లి | virat kohli earns no 1 spot in icc odi rankings for batsmen | Sakshi
Sakshi News home page

Nov 4 2013 3:10 PM | Updated on Mar 21 2024 6:35 PM

భారత స్టార్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో దుమ్మురేపిన కోహ్లి... ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ర్యాంక్‌కు చేరాడు. సచిన్, ధోనిల తర్వాత భారత్ నుంచి వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన క్రికెటర్ కోహ్లి. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఆమ్లా కంటే కోహ్లి 13 రేటింగ్ పాయింట్లు ఎక్కువ సాధించాడు. 2010 నవంబరు నుంచి ఆమ్లా అగ్రస్థానంలో ఉండటం విశేషం. అలాగే శిఖర్ ధావన్ 12 స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంక్‌కు చేరాడు. డబుల్ సెంచరీ హీరో రోహిత్ శర్మ ఏకంగా 25 స్థానాలు మెరుగుపరుచుకుని 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి ధోని (6వ ర్యాంకు), రైనా (19వ ర్యాంకు) కూడా టాప్-20లో ఉన్నారు. ఆస్ట్రేలియాపై 3-2తో సిరీస్ విజయం సాధించిన భారత్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కాపాడుకుంది. బౌలర్ల విభాగంలో అజ్మల్ (పాకిస్థాన్) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. పీపుల్స్ చాయిస్ అవార్డు రేసులో ధోని, కోహ్లి దుబాయ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. డిసెంబర్ 13న జరిగే పాలక మండలి సమావేశంలో విజేత పేరును ప్రకటిస్తారు. వీరిద్దరితో పాటు ఈ అవార్డు కోసం మైకేల్ క్లార్క్ (ఆసీస్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) కూడా పోటీపడుతున్నారు. వీరిలో విజేతను నిర్ణయించేందుకు అభిమానులు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement