రెండు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభానికి ముందు టెన్నిస్ పండితులు కూడా రాఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్ ఫైనల్లోకి వస్తారని ఊహించలేకపోయారు. గాయాల బారిన పడటం... ఫామ్ కోల్పో వడం... జొకోవిచ్, ఆండీ ముర్రే, వావ్రింకాలతోపాటు ఇతర యువ ఆటగాళ్లు జోరు మీద ఉండటం... తదితర కారణాలతో కొంతకాలంగా వీరిద్దరూ అంతర్జాతీయ సర్క్యూట్‌లో వెనుకబడిపోయారు. దాంతో సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఈ ఇద్దరినీ ఎవరూ ఫేవరెట్స్‌గా పరిగణించలేదు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ... అనుభవమే పెట్టుబడిగా... ఆత్మవిశ్వసమే ఆసరాగా ఫెడరర్ ఒక్కో అడ్డంకిని అధిగమించి ఫైనల్‌కు చేరుకోగా... ‘నీవెంటే నేనున్నాను... కాచుకో ఫెడరర్’ అంటూ నాదల్ కూడా ఈ స్విస్ స్టార్ జత చేరాడు.
Jan 28 2017 7:08 AM | Updated on Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement