బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు తొలి పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా)తో గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 15–21, 17–21తో ఓడిపోయింది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సున్ యు ఆద్యంతం నిలకడగా ఆడి సింధు జోరుకు అడ్డుకట్ట వేసింది. తొలి గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాలేదు.