ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపికలో పెను సంచలనం. ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు భారత జట్టులో చోటు దక్కింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేకపోరుునా, ఇటీవల కాలంలో మెరుగైన పేస్ బౌలింగ్ చేస్తున్న కారణంగా హార్ధిక్‌కు జాక్‌పాట్ తగిలింది. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులోకి వచ్చేశాడు. న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం కూడా ఊహించని అంశం.