సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు తెరలేపిన కొత్తనాటకంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. విభజనపై స్పీకర్ కు వైఎస్సార్ సీపీ ఇచ్చిన నోటీసుతో ఆ పార్టీకి మైలేజ్ వస్తుందన్న భయం కారణంగానే కిరణ్, బాబులు సరికొత్త పన్నాగంతో ముందుకెళుతున్నారని ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు విమర్శించారు.