గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా అనంతపురం తాడిపత్రిలో చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సోమవారం దీక్షలు చేపట్టిన దాదాపు 30 మంది కార్యకర్తలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే.. పోలీస్ స్టేషన్ లోనే తాము దీక్షలు కొనసాగిస్తామని పార్టీ నేత రమేశ్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు జగన్ దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు కామినేని, ప్రత్తిపాటి దిష్టి బొమ్మలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దహనం చేశారు.
Oct 12 2015 4:15 PM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement