హుదూద్ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలోని ధర్మానగర్ ప్రాంతంలో తుఫాను బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సహాయ సామగ్రి విశాఖపట్నానికి చేరుకుంది. ఆ సామగ్రిని బాధితులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత రెండు రోజులుగా విశాఖలోనే ఉండి, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ మేరకు వారందరికీ సహాయం అందేలా ఇటు పార్టీ వర్గాలతోను, అటు స్వచ్ఛంద సంస్థలతోను సమన్వయం చేస్తున్నారు.
Oct 16 2014 3:51 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement